మీ ఇంటి గోడలు మాయిశ్చర్‌గా ఉంటే.. వర్షాకాలం ముందే ఇది చేయండి!

-

ఎండాకాలం పోతోంది.దీంతో వర్షాకాలం కూడా రానే వస్తుంది.అయితే, ఈ కాలంలో కొన్ని ఇంటి గోడలు నీటి చెమ్మ, తడిగా అవుతాయి. చాలా మంది దీనికి కారణం నాణ్యత లేని గోడ నిర్మాణంగా భావిస్తారు. కానీ, కొన్ని బాత్‌రూంలలో మంచి నాణ్యత ఉన్న మెటిరీయల్‌తో టైల్స్‌ నిర్మాణం చేపట్టిన గోడలు పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ప్యాచస్‌ కూడా వస్తాయి. అది కాస్త చూడటానికి కూడా వికారంగా కనిపిస్తుంది. అయితే,ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్, హిప్‌కౌచ్‌ కోఫౌండర్‌ పరీక్షత్‌ హెమ్రజనీ దీనికి కొన్ని టిప్స్‌ను అందించారు ఆ వివరాలు తెలుసుకుందాం.


ఈ లీకేజీ వల్ల ఇంటి పెయింట్‌ పోతుంది. ఫంగస్‌ ఇతర సమస్యలు వచ్చి అందవిహీనంగా తయారవుతుంది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గోడ పగుళ్లకు ఎలా నివారించాలో తెలుసుకుందాం. వాతావరణ మార్పుల వల్ల ఇంటి నిర్మాణం పాడు చేస్తుంది. మొదటగా ఈ పగుళ్లు కిటికీలు, డోర్ల భాగంలో ఏర్పడుతుంది. దీనికి తగిన నాణ్యమైన పెయింట్‌ను వాడాల్సిన అవసరం ఉంది. ముందుగా గ్యాప్‌లను ఫిల్‌ చేయాలి. ఆ తర్వాత మంచి పెయింట్‌ వాడాల్సిన అవసరముంటుంది. ఇది వర్షాకాలం ముందే చేయాలి. ఎందుకంటే ఇదంతా ప్రక్రియ పూర్తి అయి, గోడ ఆరిపోయే సరికి చాలా సమయం పడుతుంది. గోడలకు చెమ్మ రావడానికి ప్రధాన కారణం వెంటిలేషన్‌ తక్కువగా ఉండటం.

ఇంటి అందం కూడా పాడవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు కిటికీలు, డోర్లను తెరచి ఉంచాలి. దీనివల్ల గోడలకు చెమ్మ పడకుండా ఉంటుంది. గోడ తడికి మరో కారణం ఇంట్లోని పొగ బయటకు వెళ్లకపోతే కూడా కారణం. ఈ పొగ ఇంటి కిచెన్, బాత్‌రూం లలో ఎక్కడైతే వేడి నీటి వాడకం ఉంటుందో అక్కడ పొగ బారుతుంది. వీలైతే ఆ ప్రాంతాల్లో ఎగ్సాస్టింగ్‌ ఫ్యాన్‌ అమర్చుకోవాలి. అపుడు లోపలి పొగ సులభంగా బయటకు వెళ్లిపోతుంది. అన్ని రూంలలో కిటికీలు ఉంటే వీలైనంత సేపు వాటిని తెరచి ఉంచాలి.

అదేవిధంగా వాటర్‌ప్రూఫింగ్‌ కోట్‌ వెయాల్సి ఉంటుంది. ఇది బయట, లోపలి భాగం గోడలకు వేసుకోవచ్చు. ఇది పెయింటింగ్‌ వేసుకునే ముందే వేయాల్సి ఉంటుంది. ఇది గోడల మాయిశ్చర్‌ అవ్వకుండా కాపాడుతుంది. ఈ మాయిశ్చర్‌ జాయింట్‌ అయిన భాగంలో ఏర్పడుతుంది. టైల్సలలో గ్యాప్‌ ఏర్పడినా ,అక్కడ మాయిశ్చర్‌ మొదలవుతుంది. దాదాపు లోపలి భాగం గోడలు, బాత్‌రూంలను వాటర్‌ప్రూఫింగ్‌ చేసుకోవడం మేలు.

Read more RELATED
Recommended to you

Latest news