మెట్రో ప్రయాణికులకు భారీ ఊరట..టైమింగ్స్ లో మార్పులు

-

లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, సడలింపులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుత లాక్‌డౌన్‌ ఈ నెల 9వ తేదీతో ముగియనుండగా.. మరో 10 రోజుల పాటు పొడిగించారు. కేబినెట్‌ తాజా నిర్ణయం ప్రకారం.. ఈ నెల 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఉంటాయి.. ఇక, ఇంటికి చేరుకోవడానికి అదనంగా మరో గంట అంటే సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు అమల్లో ఉండనుండగా..

Metro
Metro

సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీంతో మెట్రో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది ఈ మేరకు ఈ నెల 10 నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే రైలు సాయంత్రం ఆరు గంటల నుంచి నిర్విరామంగా తిరగనున్నాయి. దీంతో మెట్రో రైలు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి 6 గంటల వరకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టైమింగ్స్ ను బుధవారం అధికారికంగా మెట్రో అధికారులు ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news