హ్యుండాయ్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్లు.. 1.5ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్లు

కారుకొనుక్కోవ‌డం ప్ర‌తి స‌గ‌టు మ‌నిషి కోరిక‌. మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌క‌యితే ఇదో గొప్ప క‌ల‌. ఏ మాత్రం ధ‌ర తక్కువ అయినా ఎగ‌బ‌డి కొనేస్తుంటారు. అయితే ఈ క‌రోనా చేయ‌వ‌ట్టి చాలామంది కార్ల క‌ల‌ను క‌ల గానే మిగిల్చుకుంటున్నారు. అలాంటి వారి కోసం హ్యుండూయ్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. భారీగా డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది.

ఈ మే నెల‌కు గాను స్పెష‌ల్ డిస్కౌంట్ ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించింది. హ్యుండాయ్ శాంత్రో, కోనా ఈవీ, గ్రాండ్ ఐ10 నియోస్‌, ఆరా లాంటి బ్రాండెడ్ కార్ల‌పై డిస్కౌంట్ ఇస్తున్న‌ట్టు తెలిపింది. ఈ ఆఫ‌ర్లు మే 31వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇక ఒక్కో కారుపై 1.5ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్ ఇస్తున్నామ‌ని చెప్పింది. దీంతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్లు, బోన‌స్‌, ఇత‌ర కార్పొరేట్ డిస్కౌంట్ల‌ను క‌స్ట‌మ‌ర్ల కోసం అందిస్తున్నామ‌ని వివ‌రించింది. క‌రోనా కార‌ణంగా కార్లు కొన‌లేక‌పోతున్న వారి కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సంస్థ తెలిపింది.

ఇందులో శాంత్రో కారుపై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, గ్రాండ్ ఐ10పై రూ.45వేల వ‌ర‌కు భారీ డిస్కౌంట్ ఉంటుంద‌ని చెప్పింది. ఇక ఆరాపై కూడా రూ.45వేలు, ఐ20పై 15,000 క్యాష్ డిస్కౌంట్లు ఉంటుందని వివ‌రించింది. అయితే వీట‌న్నింటిపై 10వేల ఎక్స్‌ఛేంజ్‌, 5వేల కార్పొరేట్ డిస్కౌంట్లు ఉంటాయ‌ని సంస్థ స్పష్టం చేసింది. మ‌రి ఈ ఆఫ‌ర్లును మీరు కూడా వినియోగించుకోండి.