బ్రేకింగ్: కేంద్రానికి జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు కాస్త ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విజ్ఞప్తులు చేసారు. ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏ మాత్రం సరిపోవడం లేదని ఆయన లేఖలో వివరించారు. 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ని కేటాయించాలి అంటూ జగన్ విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా భారత్ బయోటెక్ తయారుచేస్తున్న వ్యాక్సిన్ కి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందించాలని తర్వాత ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ తీవ్రస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్ కొరత కూడా తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈ లేఖ రాశారు.