కన్న తల్లి మీద ప్రేమతో ఆ పిల్లాడు ఏం చేసాడో చూడండి… వైరల్ వీడియో…!

మన కన్న తల్లిని ఎవరైనా ఏమైనా అంటే…? కోపం కట్టలు తెంచుకుంటుంది. వారిని చంపేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఉండదు. అమ్మ ఎవరికీ అయినా అమ్మే కదా… అలాంటి అమ్మను బాధపెడితే ఊరుకుంటామా…? ఎదుటి వాడు ఎంత బలవంతుడు అయినా సరే మనకు ఆగ్రహం కలుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే ఎదుటి వాడి మీద కచ్చితంగా తిరగాబడతాం… సరిగా ఇదే చేసాడు ఒక బాలుడు… తన తల్లిని కారుతో గుద్దిన వ్యక్తి మీద యుద్దానికి దిగాడు… తన బలం సరిపోక పోయినా సరే గొడవ పడ్డాడు…

సౌత్ చైనా పోస్ట్ పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 30 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో… ఒక తల్లి తన కొడుకుతో కలిసి రోడ్డు దాటుతూ ఉంటుంది. అయితే ఆమె కారుని గమనించకుండా… కుడి వైపుకి చూస్తూ రోడ్డు దాటుతుంది. ఈ క్రమంలో ఎడమ వైపు నుంచి వచ్చిన ఒక కారు… ఆమెను డీకొట్టడంతో కింద పడిపోతుంది… ఆమె పక్కన ఉన్న తన కుమారుడు కూడా కింద పడిపోతాడు… వెంటనే… ఆ పిల్లాడు ఏడుస్తూ తన తన తల్లిని లేపుతాడు… ఇదే సమయంలో ప్రమాదం చేసిన, కారు యజమాని మీద గొడవకు దిగుతాడు…

తన తల్లి గాయపరిచిన ఆ కారుని కాలి తో తన్నుతూ… కారులో నుంచి దిగాలి అంటూ యజమానిని గదమాయిస్తాడు… దీనితో ఆ యజమాని పిల్లాడిని చూసి నవ్వుతూ కారు దిగి ఆమెను తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్తాడు… అతనితో పిల్లాడు పోరాడే సమయంలో… ఒక పక్కన తన తల్లిని లేపుతూ… ఒక పక్క గొడవకు దిగుతూ తల్లి మీద తనకు ఎంత ప్రేమ ఉందో చూపించాడు. ఈ వీడియో అక్కడ ఉన్న సెక్యురిటి కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఈ వీడియో ఊపేస్తుంది. చిన్న వయసులో తల్లి మీద అంత ప్రేమ పెంచుకున్న ఆ పిల్లాడు ఎందరికో ఆదర్శం అంటూ పలువురు కొనియాడుతున్నారు.