15 లక్షల బీరు సీసాలతో బౌద్ధాలయం.. పర్యావరణ పరిరక్షణ కోసమే..!!

-

మన అవసరాలకు వాడే చాలా వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది.. కానీ వాటిని ఏం చేయలకే.. ఎన్నో ఏళ్లగా అలానే వాడేస్తున్నాం.. ఈ మధ్యనే ప్లాస్టిక్‌పై ప్రభుత్వాలు కఠిన ఆంక్షాలు విధించాయి.. కానీ చాలమంది గుర్తెరగని సమస్య గాజు..ప్లాస్టిక్‌ మాత్రమే కాదు.. గాజు కూడా భూమిలో కలవదు.. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయ వనరు..మద్యం.. మద్యం సీసాలు చాలావరకు గాజుతోనే ఉంటాయి.. వీటిని తాగేసి.. ఆ తాగిన మత్తులు మళ్లీ అదే సీసాలతో తలలు పగలుకొట్టుకుంటారు కొందరు.. వీటితో చాలామంది.. మంచి మంచి పేయింటింగ్స్‌ వేస్తుంటారు. మనాలీ, గోవా లాంటి పర్యటక ప్రాంతాల్లో అయితే.. మద్యం సీసాలను అందంగా డెకరేట్‌ చేస్తారు.. ధాయ్‌లాండ్‌లో ఏకంగా బీరు సీసాలతో ఆలయమే నిర్మించారు.. 15 లక్షల సీసాలతో ఈ ఆలయాన్ని నిర్మించారట..
థాయ్‌లాండ్‌లోని సిసాకేత్‌ ప్రావిన్స్‌ ఖున్‌హాన్‌ ప్రాంతంలో సీసాల ఆలయం ఉంది.. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరు సీసాల సేకరణ మొదలుపెట్టారట. ఆలయ నిర్మాణానికి అంచనా వేసిన మేరకు 15 లక్షల ఖాళీ సీసాలను సేకరించి, రెండేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంగణంలో ఇదేరీతిలో 2009 నాటికి ఇరవై కట్టడాలను నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటెన్లు వంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించినవే కావడం విశేషం..
‘మిలియన్‌ బాటిల్‌ టెంపుల్‌’గా వార్తలకెక్కిన ఈ ఆలయం పేరు ‘వాట్‌ పా మహా చేది కేవ్‌’. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేదట… దానిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే, స్థానికులే కాకుండా థాయ్‌ ప్రభుత్వం కూడా తనవంతుగా లక్షలాది ఖాళీసీసాలను ఈ ఆలయానికి పంపించింది.. ఈ సీసాల ఆలయం థాయ్‌లాండ్‌లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది ఇక్కడకు వచ్చి ఫొటోలు దిగుతుంటారు.
చుట్టూ సముద్రతీరం ఉండే థాయ్‌లాండ్‌ బీచ్‌లలో పర్యాటకుల కోలాహలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు– అంటే, 1984 నాటికి ముందు థాయ్‌ బీచ్‌లలో ఎక్కడ చూసినా వాడి పారేసిన ఖాళీ బీరుసీసాలు గుట్టలు గుట్టలుగా కనిపించేవి. సముద్రాన్నే మింగేసేంతగా ఖాళీ సీసాల గుట్టలు ఏర్పడటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.. థాయ్‌ ప్రభుత్వానికి కూడా ఇదో తలనొప్పిగా మారింది. అయితే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీరంలో గుట్టలుగా పేరుకుపోతున్న ఖాళీసీసాలను ‘ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి’ అని ప్రజలను కోరింది.
ప్రభుత్వం పిలుపుతో బౌద్ధభిక్షువులు ముందుకొచ్చారు. ‘ఖాళీసీసాలను మాకిచ్చేయండి. మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటాం’ అని అడిగారు. ‘ఇవ్వడమేంటి? తీరానికి వెళ్లి మీరే కావలసినన్ని సీసాలను తీసుకెళ్లండి’ అని బదులిచ్చింది ప్రభుత్వం. లక్షలాది సీసాలను తెచ్చుకోవడం కొద్దిమంది బౌద్ధభిక్షువుల వల్ల సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఆలయ ధర్మకర్తలు బాగా ఆలోచించి, సీసాల సేకరణ కోసం ప్రజల సహాయాన్ని కోరారు. కానీ ఒక్కరూ స్పందించలేదు. కొన్నాళ్లు ఓపికగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మరో ప్రకటన చేశారు. ‘పరిశుభ్రతే పరమాత్మ. అందువల్ల అందరూ తలా ఓ చెయ్యి వేసి, దైవకార్యానికి మీ వంతు సహాయం చెయ్యండి. ఆలయ నిర్మాణానికి కలసిరండి. పర్యావరణ పరిరక్షణకు సహాయపడండి’ అని ప్రకటించడంతో ప్రజల్లో నెమ్మదిగా స్పందన స్టాట్‌ అయింది.. ఒక్కొక్కరే సీసాలు సేకరించి, ఆలయానికి ఇవ్వసాగారు.
థాయ్‌ తీరంలో నెమ్మదిగా సీసాల గుట్టలు తగ్గాయి.. అలాగే ఆలయ నిర్మాణం ఊపందుకుంది.. రెండేళ్ల వ్యవధిలోనే ఇలా చక్కని సీసాల ఆలయం తయారైంది..

Read more RELATED
Recommended to you

Latest news