అబ్బ.. ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అంటారా? అక్కడే మీరు పప్పులో కాలేశారు. అవి చూడటానికి అందంగా ఉంటాయి కానీ.. అవి ఎంత డేంజర్ పువ్వులో తెలుసా? మూసుకుపోయే గుణం ఉన్న కొన్ని రకాల పువ్వులను మాంసాహార పువ్వులని పిలుస్తారట. ఇటువంటి పువ్వులు న్యూగినియా, బొలీవియా లాంటి చోట్ల ఉంటాయట. ఇటువంటి వింత పువ్వులు పూసే చెట్లను సైంటిస్టులు కనిపెట్టారు.
పువ్వులు చూడటానికి అందంగా ఉన్నాయి కదా అని ఏవైనా పురుగులు వాటి మీద వాలితే.. ఇక అంతే సంగతులు. ఆ పువ్వులు వెంటనే ముడుచుకుపోతాయి. దీంతో ఆ పువ్వుల మొక్కకు ఆ పురుగులు ఆహారంగా మారిపోతాయి. దక్షిణాఫ్రికాలోనూ ఇటువంటి మాంసాహార మొక్కలు ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. కొన్ని రకాల ఔషధాలు, ఆయుర్వేద మందుల తయారీలోనూ ఈ మొక్కలను ఉపయోగిస్తారట.