ఈ మధ్య సమాజంలో ఆడవాళ్ళ భద్రత అనేది ప్రశ్నార్ధకం అయింది. ఎన్ని విధాలుగా పోలీసులు జాగ్రత్తలు తీసుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెడుతున్నా ఆడవాళ్ళ మీద దాష్టికాలు అనేవి ఆగడం లేదు. కోర్ట్ లు, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఉభయ సభల్లో ఎన్ని బిల్లులు పాస్ అవుతున్నా, రాష్ట్రపతి ఎన్ని బిల్లుల మీద సంతకాలు చేస్తున్నా ఆడవాళ్ళ భద్రత అగమ్య గోచరమే అవుతుంది.
తాజాగా ఒక ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక టెకీ చెవి పోగులు కనిపెట్టాడు. సరికొత్తగా ఆలోచించాడు ఆడవాళ్ళ భద్రత కోసమని. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి కి చెందిన శ్యామ్ చౌరాసియా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆడవాళ్ళ రక్షణ కోసం ఏదో చెయ్యాలి అనే తపన అతనిలో ఎక్కువగా ఉండేది. దీనితో లిప్‌స్టిక్, హాండ్‌బ్యాగ్‌లలోనూ ఆడవాళ్ళ రక్షణ కోసం కొత్త పరికరాలను తయారు చేసాడు.
తాజాగా అధునాతన పరికరాలతో అతను చెవి దుద్దులు రూపొందించి ఆశ్చర్యపరిచాడు. వాటికి ఒక బ్లూటూత్ పెట్టాడు. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు బటన్ నొక్కితే చాలు మొబైల్‌ఫోన్‌కు అనుసంధానమై పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ వెళ్లిపోవడంతో వాళ్ళు లొకేషన్ ద్వారా వచ్చేయవచ్చు. ఇక ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాటరి పరికరం ద్వారా ఒక తూటా పేల్చే సదుపాయం కూడా ఉంటుంది. ఆ తూటా సౌండ్ కిలోమీటరు వరకు వినపడుతుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అలెర్ట్ అవవచ్చు.