వెంటనే రంగంలోకి దిగిన అఫ్జల్ గంజ్ పోలీసులు.. సీబీఎస్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి.. బస్సు దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. సిటీల్లోని ఇతర సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. బస్సు నాందేడ్ రూట్‌లో వెళ్లినట్లు తెలిసింది. నాందేడ్‌లోని షెడ్‌కు ఆ బస్సును తీసుకెళ్లిన దుండగులు.. దాన్ని పూర్తిగా ఎక్కడికక్కడికి విడదీసారు. వెంటాడుతూ, నాందేడ్ చేరుకున్న అఫ్జల్ గంజ్ పోలీసులకు గట్టి షాక్ తగిలింది. అక్కడ అసలు బస్సనేదే లేదు. సీట్లు, రాడ్లు, ఇనుకరేకులు, బస్సురూట్ ప్లేటు, ఆఖరికి బస్సు అడుగు ఫ్రేము తప్ప ఏమీ కనబడలేదు. అప్పటికి కూడా పాపం… పిల్లలు ఇంకా కష్టపడుతూనేఉన్నారు. నాందేడ్ పోలీసుల సాయంతో షెడ్‌లో బస్సును ధ్వంసం చేస్తున్న దుండగులను అదుపులోకి తీసుకున్నారు. అన్నట్లు, బస్సును ఈ షేపుకి తీసుకురావడానికి వాళ్లకి కేవలం ఆరు గంటలే పట్టిందట. మంచి పనిమంతులే కదా.!
హైదరాబాద్‌లో బస్సు.. నాందేడ్‌లో తుక్కు..!
-