కోడిని కోయకుండానే కూరొండుకొని తినేయొచ్చు..!

-

ఇది అసలే దసరా సీజన్. కోళ్లకు ఇప్పుడు ఫుల్లు గిరాకీ.. మాంచి చికెన్ ఫ్రై చేసుకొని అన్నంలో కానీ.. రోటిలో కాని తింటుంటే ఉంటుంది మజా.. ఆహా.. నోరూరుతోందా? కానీ.. చికెన్ తినాలంటే కోడిని కోయాలి కదా అంటారా? ఇప్పటి వరకు కోడిని కోసుకొని తినేవాళ్లం. కానీ.. ఇప్పటి నుంచి కోడిని కోసుకోకుండానే అది బతికుండగానే దాని మాంసాన్ని తినేయొచ్చు. అర్థం కాలేదా? అయితే పదండి ఓసారి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లి సరిగ్గా కనుక్కుందాం.

శాన్ ఫ్రాన్సిస్కో లో శాస్త్రవేత్తలు ఓ కొత్త పరిశోధన మొదలు పెట్టారు. ఏంటయ్యా అది అంటే… సెల్ బేస్డ్ మీట్ ప్రొడక్షన్.. అంటే కణం ఆధారంగా మాంసాన్ని ఉత్పత్తి చేయడం అన్నమాట. కోడి అయినా.. మేక అయినా.. గొర్రె అయినా.. ఇంకా ఏ జంతువైనా.. దాన్ని మనం కోసుకొని తినకుండా… దాని కణం నుంచి మాంసాన్ని అభివృద్ధి చేయడమన్నమాట.

ఉదాహరణకు కోడిని తీసుకుంటే.. దాని రెక్కల్లో ఉండే కణాల నుంచి వాళ్లు మాంసం ముక్కలను అభివృద్ధి చేస్తారు. ఆ మాంసం ముక్కలు అచ్చం కోడి మాంసం లాగానే ఉంటాయి. ఏమాత్రం తేడా ఉండదు. చేపలు కూడా అంతే.. వాటి సజీవ కణాల నుంచి మాంసాన్ని ఉత్పత్తి చేయొచ్చని కుండబద్ధలు కొట్టి మరీ చెబుతున్నారు సైంటిస్టులు. దీని వల్ల కోళ్లను, మేకలను గట్రా చంపాల్సిన అవసరం ఉండదని.. ఈ మాంసం వల్ల ఎటువంటి వ్యాధులు కూడా రావని బల్ల గుద్ది చెబుతున్నారు సైంటిస్టులు. ఈ తరహా విధానంపై ఇంకా పరిశోధన కొనసాగుతోంది. కానీ.. కొన్ని రోజుల్లోనే మనం అటువంటి రోజులను చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news