మనిషి ఎలా బతకాలో, ఎలా ప్రవర్తించాలి, అసలు పుట్టకకు అర్థం ఏంటో భగవద్గీత భోదిస్తుంది.. సంబంధాలను ఎలా బలపరుచుకోవాలి, చుట్టు ఉన్న వారిలో నీ వాళ్లు ఎవరు, నీ అవసరాల కోసం ఉంటున్నారా, నీకోసం ఉంటున్నారా.. భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి ఇలాంటి విషయాలను చాణుక్యుడు భోదిస్తాడు. ప్రేమ అయినా పెళ్లి అయినా జంట మధ్యలో ఏం ఉండకూడదో చాణుక్యుడు వివరంగా చెప్పాడు. అవి ఏంటంటే..
గొడవలు వద్దు
బాయ్‌ఫ్రెండ్స్ లేదా గర్ల్‌ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. అదే విధంగా దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. కానీ అలాంటి సమయాల్లో సమన్వయం లోపిస్తే, సంబంధం బలహీనపడి విడిపోవడానికి దారితీస్తుంది. ఆచార్య చాణక్య ప్రకారం.. మీరు ప్రేమ సంబంధం మరియు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే, మీరు మనశ్శాంతి మరియు గౌరవ భావాన్ని కలిగి ఉండటం ముఖ్యం. లేకుంటే మీ బంధాలలో గ్రహణం ఏర్పడుతుంది అని చాణక్య నీతి చెబుతుంది. కాబట్టి మీ భర్త లేదా భార్యతో గొడవపడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి, గొడవలు లేకుండా ఈ సమస్యను పరిష్కరించగలరేమో చూడండి.
అహంకారం లోపలికి రానివ్వకండి..
మీ వైవాహిక జీవితంలో లేదా మీ ప్రేమ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మధ్య అహంకారం రాకుండా చూసుకోవాలి. మీలో ఎవరైనా అహంకారంతో ఉంటే ఆ సంబంధం ముగిసిపోతుంది. అహం మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత, అసంతృప్తికి దారి తీస్తుంది. ఎందుకంటే అహం అనేది గ్రహణం లాంటిది. ఇది మీ సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అహం అనేది ముల్లు లాంటిది. బెలూన్‌ను ముల్లుతో తాకినప్పుడు, అది పగిలిపోతుంది. అందుకే మీ వైవాహిక జీవితంలో గర్వం ముల్లులాంటిది. అహం, గర్వం, ఇగో ఇలాంటివి అన్నీ బయటవాళ్ల మీద చూపించినా ఏం కాదు కానీ నీ భార్య మీద, భర్త మీద, పిల్లల మీద చూపించడకూడదు.. ఏ బంధంలో అయితే ఇవి తిష్ట వేసుకుంటాయో. .అక్కడ ఇక బంధం అనే మాట ఉండదు. పంతం మాత్రమే ఉంటుంది.
ఈ సమస్యలన్నీ ప్రతి ఒక్కరిలో కొంతమేరకైనా ఉంటాయి. కానీ ఆ సమస్యలపై చాలా శ్రద్ధ వహించండి. అలాంటి వాటిని జాగ్రత్తగా నిర్వహించడం నేర్చుకోండి. అప్పుడే ప్రేమ, పెళ్లి బాగుంటాయి.