ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలు యోగ్యులు అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అలాగే అన్నిటిలో కూడా సక్సెస్ అవ్వాలనే తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే అన్నిటికంటే కూడా తండ్రి బాధ్యత చాలా ముఖ్యం అని చాణక్య నీతి చెబుతోంది.
ప్రతి తండ్రి తన సామర్థ్యానికి తగ్గట్టుగా పిల్లలకు చేయూతను అందించడానికి ప్రయత్నించినా అనుకున్నంత స్థాయిని కొడుకులు చేరుకోలేకపోయారు. అందుకనే తండ్రి తప్పకుండా వీటిని పాటించాలి. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం.
క్రమశిక్షణ నేర్పడం:
తండ్రి తమ యొక్క పిల్లలకి క్రమశిక్షణ నేర్పాలి అని చాణక్య నీతి చెబుతోంది. పిల్లలకి క్రమశిక్షణ ఉంటే చక్కగా జీవితాన్ని మార్చుకోగలుగుతారు. క్రమశిక్షణ ఉంటే పిల్లలకి బద్ధకం కూడా ఉండదు. భవిష్యత్ లో పైకి రావడానికి కూడా క్రమశిక్షణ సహాయం చేస్తుంది.
పిల్లల్లో ప్రతిభ:
ప్రతి ఒక పిల్లవాడికి కూడా ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది అని చాణిక్యనీతి చెబుతోంది. దానిని గుర్తించే తండ్రి ఉంటే పిల్లలు విజేతలు అవుతారు.
ఇంటి వాతావరణం:
పిల్లలపై అధిక ప్రభావం ఇంటి వాతావరణం చూపుతుంది కాబట్టి ఇంటి పరిసరాలు అంతా కూడా సవ్యంగా ఉండేటట్టు తండ్రి చూసుకోవాలి.