పిల్లి మలంతో కాఫీ; యాక్ అనొద్దు, డిమాండ్ మామూలుగా లేదు మరి…!

-

కాలం మారుతున్న కొద్దీ తినే తిండే, తాగే పానీయాలు కూడా వింతగా ఉంటున్నాయి. అడవిపిల్లి తిని విసర్జించిన కాఫీ పండ్ల గింజలతో తయారయ్యే కాఫీకి ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది. వివరాల్లోకి వెళితే మడికేరికి చెందిన స్టార్టప్‌ కంపెనీ ఇలాంటి కాఫీ గింజలకు మంచి పాపులారిటి తీసుకొచ్చింది. ఆ పిల్లి తిని విసర్జించిన కాఫీ గింజలతో తయారు చేసే సివేట్‌, లువాక్‌ కాఫీని విదేశీయులు భారీగా ఇష్టపడుతున్నారు.

మనదేశంలో కిలో కాఫీ ధర రూ.50వేల వరకు ఉండగా, ఈ కాఫీ పొడిని కిలో 10వేలకు బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. సోషల్‌మీడియాలో సీసీసీ స్మార్ట్‌యాప్‌ సంస్థ ఈ కాఫీకి ప్రాచుర్యం కల్పించడంతో, బ్రెజిల్‌లో ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. పది వేలు పెట్టి కాఫీ తాగడం ఏముంది గాని ఆ గింజలను సేకరించడం మాత్రం ఒకరకంగా నరకం అని స్టార్టప్‌ కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు.

కాఫీ తోటలలో అడవిపిల్లులు తిని విసర్జించిన గింజలకోసం కార్మికులు ప్రత్యేకంగా అదొక పనిగా తిరుగుతారు. ఆ తర్వాత గింజలను శుభ్రం చేసి కాఫీపొడిగా మారుస్తారు. తొలుత ఏటా 20కిలోల కాఫీ పొడిని తయారు చేయగా డిమాండ్‌ పెరగడంతో ప్రస్తుతం 800 కిలోల కాఫీని తయారు చేస్తున్నారు. శాస్త్రీయంగా 150 గ్రాముల ప్యాకెట్‌లతో ఐన్‌మనె బ్రాండ్‌తో ఈ స్టార్టప్‌ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఆ కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని కూడా సమాచారం. అందుకే అంత మంది తాగుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news