పెళ్ళి చేసుకోవాలా? లేదా సింగిల్ ఉండాలా అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది తెలుసుకోండి.

-

పెళ్ళి చేసుకుని సంసార వాహనాన్ని నడుపుతున్న ప్రతీ ఒక్కరూ పెళ్ళి కాని వాళ్ళకి చెప్పే మాట ఒకటుంటుంది. మీరు చాలా హాయిగా ఉన్నారు. అస్సలు పెళ్ళి చేసుకోవద్దు. ఎప్పటికీ ఇలాగే ఉండండి. హ్యాపీగా ఉంటారని చెబుతారు. కానీ పెళ్ళి వయసుకి వచ్చిన వాళ్ళు మాత్రం వేరేలా ఆలోచిస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తున్నాను. పక్కన ఎవరైనా తోడుంటే బాగుండు, చేతిలో నా కొడుకో, కూతురో ఉండుంటే బాగుండేది కదా అని. ఒక్కోసారి అసలు పెళ్ళి చేసుకోకపోవడమే బాగుంటుందేమో అనిపిస్తుంది కూడా. ఇలా పెళ్ళి చేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ పెళ్ళి వయసుకి వస్తున్న ప్రతీ ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది.

పెళ్ళనేది స్వంత విషయం. అవతలి వాళ్ళు ఎన్ని చెప్పినా మీకేమనిపిస్తుందన్న దాని మీదే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్ళి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉండగలరు? చేసుకోకుంటే వచ్చే లాభాలేమిటో మీరే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. పెళ్ళి చేసుకోకపోతే ప్రతీ విషయంలో నిర్ణయం మీదే ఉంటుంది. మీరు ఆలోచించుకున్న నిర్ణయమే ఫైనల్. మిమ్మల్ని ఎవ్వరూ బలవంత పెట్టరు. అలా పెట్టినవాళ్ళకి దూరంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పెళ్ళిలో ఆ అవకాశం ఉండదు. ఒక్కసారి కలిసి బ్రతకడం జీవించాక ఒంటరిగా బ్రతకడం కష్టం అవుతుంది.

ఇంకా, సమాజంలో కట్టుబాటు ఉంటాయి. కాబట్టి అలాంటి సాహసాలు చేయకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ నిర్ణయాలు మీ స్వేఛ్ఛని హరించి వేస్తుంటాయి. మీకు బాగా నచ్చని వారితో(మీ భాగస్వామి కుటుంబ సభ్యులు) నవ్వుతూ మాట్లాడాల్సి ఉంటుంది. మీకు ఇష్టం లేని పనులు పక్కవాళ్ళు ఏమనుకుంటారో అని చేయాల్సి ఉంటుంది. ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ, మీకేదైనా కష్టం వస్తే వాళ్ళే ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మీ స్నేహితులు ఒక్కోసారి మీ వద్ద ఉండకపోవచ్చు. కానీ, మీ భాగస్వామి మాత్రం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news