9 నిమిషాల్లోనే 646 కోట్లు పలికిన పెయింటింగ్…!

-

David Hockney painting sells for $90M, smashing auction records

9 అంటే 9 నిమిషాల్లోనే ఆ పెయింటింగ్ వేలంలో సుమారు 646 కోట్ల రూపాయల ధర పలికింది. నమ్మశక్యంగా లేదు కదా. ఓసారి గిల్లుకొని చూడండి. నొప్పి పుట్టిందా? అయితే ఇది నిజమే. డేవిడ్ హాక్నీ తెలుసు కదా. చాలా ఫేమస్ ఆర్టిస్ట్. బ్రిటన్ కు చెందిన వ్యక్తి. ఆయన వేసిన పెయింటింగే ఇంత ధర పలికింది. అది కూడా కేవలం వేలం ప్రారంభమయిన 9 నిమిషాల్లోనే. ఆ పెయింటింగ్ మరేదో కాదు.. మీరు పైన చూస్తున్నారు కదా ఫోటో అదే పెయింటింగ్. దాని పేరు పూల్ విత్ టూ ఫిగర్స్. న్యూయార్క్ లోని క్రిస్టీస్ లో దాన్ని వేలం వేశారు. దీంతో వేలంలో దానికి 90 మిలియన్ డాలర్ల ధర పలికింది. అంత ధర పలికి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఆ పెయింటింగ్. ఇదివరకు ఈ రికార్డు యూఎస్ కు చెందిన జెఫ్ కూన్స్ పేరు మీద ఉండేదట. ఆయన వేసిన బెలూన్ డాగ్ పెయింటింగ్ ను అదే క్రిస్టీస్ లో వేలం వేస్తే అది 58.4 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన కరెన్సీలో 419 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news