‘వేయించిన భర్త’ దొరుకును.. సరికొత్త వంటకం..!

-

భార్యలూ వింటున్నారా? అక్కడ రుచికరమైన వేయించిన భర్త అనే ఫుడ్ ఐటమ్ దొరుకుతుందట. మరి.. మీ భర్తల మీద ప్రయోగించేరు ఈ అస్త్రాన్ని.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. అసలు ఏంది స్టోరీ అంటారా? అయితే.. మనం వాట్సప్ వండర్ బాక్స్ లోకి వెళ్లాల్సిందే.

చైనాలోని ఓ రెస్టారెంట్ లో డెలిసియస్ రోస్టెడ్ హజ్బెండ్… అనే వంటకాన్ని అమ్ముతున్నారట. అంటే.. ఏంటి.. రుచికరమైన వేయించిన భర్త దాని పేరు. అంటే.. భర్తలను చికెన్ ను వేయించినట్టు వేయించి అమ్ముతారా? అంటారా? అలా ఏం కాదు కానీ.. అది ఒక వంటకం పేరు.

ఆ వంటకం పేరు మహీంద్రా కంపెనీ చైర్మన్ కంట పడింది. ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కదా. ఇటువంటి ఫోటో కనిపిస్తే వదులుతారా? మీరు పైన చూస్తున్నారు కదా.. అదే ఫోటో. అది చైనా రెస్టారెంట్ లోని మెనూ కార్డు. దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆనంద్ ఏం ట్వీట్ చేశారో తెలుసా?

ఈ రెస్టారెంట్ కు నా భార్యతో కలిసి వెళ్లాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తా. అక్కడికి ఆమెను తీసుకెళ్లి ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు ఇవ్వడం అవసరమా? అన్నట్టుగా ట్వీట్ చేశారు. ఆ ఫోటో కన్నా.. ఆయన చేసిన ట్వీట్ కే నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆనంద్ మహీంద్రా.. భలే జోక్స్ వేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయనకు వత్తాసు పలుకుతూ… భార్యలపై కామెంట్ల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version