స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కాబోతుంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి ల వంటి హిట్‌ల తరువాత బన్నీ త్రివిక్రమ్ సినిమాతో హ్యాట్రిక్ కు సిద్ధమయ్యాడు. నా పేరు సూర్య సినిమా ఫలితం కొంచెం నిరాశ పరచడంతో త్రివిక్రమ్ సినిమాతో బాక్స్‌ఆఫీస్ దగ్గర తన మార్కు చూపించాలనుకుంటున్నాడట అల్లు అర్జున్.
ఇక త్రివిక్రమ్ కూడా సినిమా హిట్ చేసి తీరాలనే కసితో ఉన్నాడట. మూవీ కోసం బరువు తగ్గి స్లిమ్‌గా మారాలని బన్నీకి సూచించాడట త్రివిక్రమ్. సినిమా సినిమాకీ డిఫరెంట్‌గా ట్రై చేసే స్టైలీష్ స్టార్ రంగంలోకి దూకి కసరత్తులు ప్రారంభించాడట.. సో… బన్నీ ఫ్యాన్స్ రెడీ అయిపోండి మరి