మంచుకురిసే వేళలో.. స్టైలిష్‌గా కనిపించే కొన్నిరకాల జాకెట్లు మీ కోసం..

-

శీతాకాలం తగినట్లు స్టైలిష్‌గా కనిపించే కొన్నిరకాల జాకెట్ల … వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు పరిచయమవుతున్నాయి. ఎన్ని మారినా, ఏమొచ్చినా ఆఫీసుకు, బయటపనులకు వెళ్లక తప్పదు. చలి నుండి బయటపడాలంటే స్వెటర్లు, టోపీలు.. పాతకాలం చలికోట్లు, టోపీలు పెట్టుకొని ఆఫీసుకి వెళ్తే అందరూ నవ్వుతారు.. సందర్భానికి తగినట్లు స్టైలిష్‌గా కనిపించే కొన్నిరకాల జాకెట్ల గురించి తెలుసుకుందాం..

క్విల్టెడ్‌ జాకెట్‌ :శీతాకాళంలోని చలిని చంపడానికి క్విల్టెడ్‌ జాకెట్‌కు మించింది లేదు. కొంచెం కూడా గ్యాప్‌ లేకుండా జిప్‌, గుండీలతో కప్పి ఉంచిన ఈ జాకెట్లు డబుల్‌ లేయర్డ్‌తో చలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. సాధారణ ప్రయాణాలకు, విహారయాత్రలకు ఈ జాకెట్లు బాగా ఉపయోగపడుతాయి. పర్వతాలను అధిరోహించేవారికి మంచునుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిని పాలిస్టర్‌, తోలు, ఉన్నితో తయారు చేస్తారు. జాకెట్‌తోపాటు డెనిమ్‌, లెగ్గింగ్స్‌, థర్మల్స్‌తో బూట్లతో క్విల్టెడ్‌ జాకెట్‌ వేసుకుంటే శీతాకాలం అన్నమాటే మర్చిపోతారు.

డెనిమ్‌ జాకెట్‌ :ఈ జాకెట్‌ ధరించగానే కాలేజ్‌ డేస్‌లు గుర్తొస్తాయి. ప్రతిక్లాస్‌లో గ్యాంగ్‌ ఉంటుంది. ఈ జాకెట్‌ ధరిస్తే లీడర్‌గా కనిపించడం ఖాయం. డెనిమ్‌ జాకెట్లు కాలేజ్‌లోనే కాకుండా శీతాకాలంలో మంచు శరీరం మీద పడకుండా చేస్తుంది. దీన్ని ధరించిన వారు కచ్ఛితంగా అందంగా కనిపిస్తారు. పలుచని బట్టలు వేసుకున్న తర్వాత డెనిమ్‌ జాకెట్‌ ధరిస్తే అందరినీ ఆకట్టుకుంటారు. శీతాకాలంలో పార్టీలు, క్లబ్‌లకు, బయటకు వెళ్లేటప్పుడు ఈ జాకెట్‌ వేసుకోవడం ఉత్తమం.

హుడెడ్‌ జాకెట్‌ :వాతావరణం ఎలా ఉన్నా స్కూల్‌, కాలేజ్‌లకు వెళ్లాల్సిందే. చలి ఎక్కువగా ఉందని మందపాటి స్వెటర్‌ వేసుకుంటే లావుగా కనిపిస్తారు. వేసుకోకుంటే చలి భరించలేరు. ఇంటికి నుంచి బయటకు ఎలాంటి ప్రదేశాలకు వెళ్లాలన్నా హుడెడ్‌ జాకెట్‌ చక్కగా సరిపోతుంది. కాజువల్‌వేర్‌కు ఇది సరైనది. థెర్మల్‌ లెగ్గింగ్స్‌, హైబూట్స్‌తో ఈ జాకెట్‌ జతచేసుకోవచ్చు.

బ్లేజర్‌ :ఉదయాన్నే ఇంటర్వూకి వెళ్లాలి. బయటకు వచ్చి చూస్తే మంచుతో కమ్మేసి ఉంది. స్వెటర్‌గాని, జాకెట్‌ గాని వేసుకొని బయలుదేరుతారు. ఆఫీసుకు చేరుకుంటారు. స్వెటర్‌తో పనిలేదు. అది ఎక్కడ పెట్టాలో తెలియదు. ఎవరికి ఇవ్వాలో అర్థంకాదు. ఇవన్నీ ఎందుకని వేసుకోకుంటే చలికి బలైపోతారు. ఇంటర్వూలకు, ఆఫీస్‌ మీటింగులకు వెళ్లానుకుంటే వార్డ్‌రోబ్‌లో బ్లేజర్‌ను చేర్చండి. ఇది స్కర్ట్‌లకంటే ప్యాంట్‌ మీదకి బాగుంటుంది. హడావుడిగా డిన్నర్‌ పార్టీలకు, ఫంక్షన్‌లకు వెళ్లేటప్పుడు మరోసారి ఆలోచించకుండా వేసుకునే జాకెట్లలో బ్లేజర్‌ ఒకటి.

స్వెట్‌ జాకెట్‌ :కాలంతో జిమ్‌కు పనిలేదు. ఏ కాలంలో అయినా జిమ్‌ మానరు కొందరు. అలాఅని చలికి తట్టుకోలేరు కూడా. చలికి తట్టుకుంటూ జిమ్‌ చేస్తుండగా వచ్చే చెమటను అదిగమించేందుకు స్వెట్‌ జాకెట్‌ ఉత్తమ ఎంపిక. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఉన్నాయి కదాఅని పార్టీలకు, ఆఫీస్‌కు ధరించకూడదు. జాకెట్‌ ఎంపికను బట్టి మీ అభిరుచులు, ప్రాధాన్యతలను అంచనా వేయవచ్చు. స్వెట్‌ ప్యాంటు, బ్యాగీ ప్యాంటు, ట్రాక్‌ ప్యాంట్‌తో స్వెట్‌ జాకెట్‌ వేసుకుంటే చూడ్డానికి అందంగా కనిపిస్తారు.

ప్రింటెడ్‌ జాకెట్‌:వర్షాకాలం వచ్చిందంటే చలి మొదలవుతుంది. దీంతో అందరూ ైప్లెన్‌ స్వెటర్లు, జాకెట్లు ధరిస్తారు. అందరిదీ ఇదే వరుస. అందరిలా కాకుండా భిన్నంగా కనిపించాలనుకుంటే ప్రింటెడ్‌ జాకెట్స్‌ను ఎంచుకోండి. జాకెట్‌ ముందు భాగంలో రకరకాల జంతువులు, త్రీడి ప్రింట్లు, వికసించే పుష్పాలతో కూడిన స్వెటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాకెట్‌ ధరించడం వల్ల పాజిటివ్‌ మైండ్‌ కలిగి ఉంటారు.

లెదర్‌ జాకెట్‌: లెదర్‌ జాకెట్‌ అంటే తెలియని వారుండరు. అంతటి పేరుగాంచిన లెదర్‌ అని చెప్పవచ్చు. అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరికైనా అందంగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ’ఎవర్‌గ్రీన్‌ ఫరెవర్‌’ అని చెప్పొచ్చు. దీన్ని శుభ్రం చేయడంగాని, డ్రైక్లీనింగ్‌కు ఇవ్వడం గాని చేయకూడదు. బూట్లుతో లెదర్‌ జాకెట్‌ ధరిస్తే అందరి దృష్టి మీవైపే ఉంటుంది.

Trench Coat: ఈ జాకెట్‌ మహిళలు మాత్రమే. ఇవి ఉన్నిజాకెట్‌కు భిన్నంగా ఉంటాయి. కొంచెం పొడవుగా ఉండడం వల్ల బరువు ఎక్కువగా ఉందనుకుంటారు. ఇది అన్నింటి కంటే తక్కువ బరువు కలిగి ఉంటుంది. దీనికి వాటర్‌ప్రూఫ్‌ కూడా ఉంటుంది. షూటింగ్‌ పనిలో దూరం ప్రయాణించేటప్పుడు ఈ జాకెట్‌ ఉపయోగపడుతుంది.

వైండ్‌చీటర్‌: చీకటిలో బయలుదేరేటప్పుడు రక్షణగా టార్చ్‌లైట్‌, చేతిలో కర్ర వెంటతీసుకెళ్తారు. అలాగే ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పుడు వైండ్‌చీటర్‌ జాకెట్‌ను ధరిస్తారు. ఇది చలినుంచి కాపాడడమే కాకుండా తీవ్రమైన గలుల నుంచి రక్షించడానికి రూపొందించబడ్డాయి. టాప్స్‌, ట్రాక్‌ప్యాంట్స్‌, ట్రసెర్స్‌, స్పోర్ట్స్‌ షూస్‌తో జాకెట్‌ ధరిస్తే బాగుంటుంది. దీన్ని కాటన్‌, పాలిస్టర్‌, లిరాతో దీన్ని కుడుతారు. ఇవి ప్రయాణాలకే కాకుండా జిమ్‌, వర్కౌట్స్‌కు ఉపయోగపడుతుంది.

Hats

పోమ్‌ పోమ్‌ టోపీ: కెనడాలో ఈ టోపీని ‘టోకో’ అని పిలుస్తారు. మహిళలు దీనికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. ఈ ధరించినప్పుడు నుదుటి నుంచి పైకి ఫిట్‌ చేసి ఉంటుంది. బీనిలాగా దగ్గర దగ్గరగా అల్లి ఉంటుంది. పైభాగంలో కిరీటం ఆకారంలో ఉంటుంది. అన్నిరకాల సైజులు, పరిమాణాలు, రంగులలో విస్తృతంగా లభిస్తాయి.

వైబ్‌బ్రిమ్‌ ఫెడోరా:దీన్ని కొన్నిసార్లు సఫారి టోపీ అని పిలుస్తారు. ప్రస్తుతం ఫాషన్‌ రంగంలోని అమ్మాయిలు ఈ టోపీకే ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. శీతాకాలంలో ధరించే బట్టలకు తగినట్లుగా ఈ టోపీని తయారు చేశారు. ఇది ధరించడం వల్ల దుస్తులకే అందం వస్తుంది. అంతేకాదు వర్షం పడుతున్నప్పుడు జట్టు తడవకుండా కాపాడుతుంది.

స్కూల్‌బాయ్‌ టోపీ:ఈ రకమైన టోపీని న్యూస్‌బాయ్‌ అని పిలుస్తారు. వీటిలో రకరకాల రంగులు ఉంటాయి. ష్యాషన్‌ రంగంలోని ష్యాషనిస్టులు ఊలుతో చేసిన టోపీలను ధరిస్తారు. ఈ టోపీ పెట్టుకున్నప్పుడు ఫిట్‌గా ఉండే స్కట్‌ మెడలో లేయర్లుగా ఉండే బంగారు గొలుసులతో షాపింగ్‌తో వెళ్తుంటే చూడముచ్చటగా ఉంటుంది.

కైబాయ్‌ టోపీ:శీతాకాలంలో వెస్ట్రన్‌ ైస్టెల్‌ను ఇష్టపడేవారు ఈ టోపీని ఎంచుకుంటారు. కౌబాయ్‌ టోపీకి తగినట్లుగా డ్రెస్‌ వేసుకోవాలి. లేకుంటే బాగుండదు. ఫ్లాన్నెల్‌ చొక్కా, జీన్స్‌తో టోపీ ధరించవచ్చు. ఫొటోలో కనిపిస్తున్న బొచ్చుచొక్కా, కష్మెరె స్వెటర్‌ కాంబోతో ఆకర్షణగా ఉంటుంది.

ఫర్‌పిల్‌ బాక్స్‌ టోపి: ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ టోపీలను ఎంచుకోవచ్చు. చలి తగ్గించడమే కాకుండా చూసేందుకు ైస్టెలిష్‌గానూ కనిపిస్తుంది. దీన్ని జివాగో టోపీ అని కూడా పిలుస్తారు. టోపీకి ఉండే మృదువైన బొచ్చు ఆకారం ప్రతి ముఖానికి నప్పుతుంది. సాధారణ దుస్తులతో పాటు దీన్ని పెట్టుకోవచ్చు. శీతాకాలంలో పొట్టిబట్టలు వేసుకున్నా ఈ టోపీ రక్షణ ఇస్తుంది. మరిన్ని ఆఫర్స్ కొరకు ఇక్కడ చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news