వంశీ రాజీనామా చేస్తారా…? ఆయన దారెటు…!

-

వంశీ రాజీనామా.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు… గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారాలి అంటే రాజీనామా చెయ్యాల్సిందేనని, ఎమ్మెల్యేలు పార్టీ మారాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుందని తమ్మినేని స్పష్టం చేశారు. అదే విధంగా తాను ముఖ్యమంత్రి నిన్ఱయానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన స్పీకర్ రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఇప్పుడు స్పీకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారతానని త్వరలోనే వైసీపీలో చేరతాను అని కీలక ప్రకటన చేశారు. ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ప్రకటించిన ఆయన అనూహ్యంగా పార్టీ మారతానని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వెనుక కారణం ఎలా ఉన్నా… ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వంశీ పార్టీ మారడానికి సిద్ధమైనా రాజీనామా చెయ్యాల్సి ఉండటం, మళ్ళీ సీటు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన పునరాలోచనలో పడ్డారని అందుకే ఆలస్యమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ప్రెస్ మీట్ నిర్వహించిన వంశీ… తనకు ఈ పదవి అవసరం లేదని, రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. దీనితో వంశీ రాజీనామా చేస్తారా అంటూ ఇప్పుడు ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆయన రాజీనామా చేస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాజీనామా చేసినా సరే… సీటు దేవినేని అవినాష్ కి ఇస్తారని అంటున్నారు. వంశీకి ముందు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ చెప్పారని ప్రచారం జరిగినా… అది నిజం కాదని కేవలం ప్రచారం మాత్రమే అని తెలిసింది. ఇప్పుడు వంశీ దారెటు అనేది మాత్రం స్పష్టత రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news