మరచిపోయి కూడా పర్సులో వీటిని పెట్టుకోకండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పర్సులో డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు. అయితే పర్సులో పెట్టుకునే వస్తువుని బట్టి కూడా పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుందని.. నెగిటివ్ ఎనర్జీ ఉన్నచోట ఇబ్బందులు, దరిద్రం లాంటివి ఉంటాయని పండితులు అంటున్నారు. అయితే చాలా మంది ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ ఫోటోలు, డబ్బులు మొదలైనవి పెట్టుకుంటుంటారు. అయితే అసలు పర్సులో ఎటువంటివి ఉంచడం వల్ల ఇబ్బందులు వస్తాయి అనేది చూద్దాం.

కాగితాలను ఎక్కువగా పర్సులో ఉంచుకోకూడదు. పేపర్లని, బిల్స్ మొదలైనవి ఉంచడం చాలామందికి అలవాటు. కానీ ఎక్కువగా పేపర్లు వంటివి ఉండకూడదు. పర్సు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. అయితే పర్సులో డబ్బులు మాత్రం కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే డబ్బులు లక్ష్మీదేవితో సమానం. కనుక అయితే చాలా మంది కాయిన్స్ ని కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు.

కాయిన్స్ ని పెట్టడం వల్ల బరువు అయిపోతుంది దీంతో పర్సు చిరిగిపోతుంది కూడా. దీని వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది అందుకని కాయిన్స్ ని ఎక్కువగా పెట్టకండి. పర్సులో రెండు ఏనుగులు ఉన్న ఫోటోలు పెడితే చాలా మంచిది. అలానే లక్ష్మీదేవి ఫోటోని కూడా పెట్టుకోవచ్చు. రావి ఆకులు పర్సులో పెట్టుకుంటే కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒకవేళ వీలైతే వెండి కాయిన్స్ ని కూడా పెట్టుకోండి. ఇలా వీటి వల్ల చాలా మంచి కలుగుతుంది పైగా ఏ సమస్యలు లేకుండా పాజిటివ్ ఎనర్జీ తో వుండొచ్చు.