టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీతో బాబర్ ఆజామ్ ఏం మాట్లాడారు! అతడు ఏం చెప్పాడంటే?

భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానులకు పండుగే. ఎక్కడ లేని ఉత్కంఠ ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో దుబాయి వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో దాయాది దేశాలు తలపడ్డాయి. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ను పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ ప్రపంచ కప్‌ మ్యాచ్‌లలో భారత్‌పై పాకిస్తాన్‌కు ఇదే తొలి విజయం.

మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లకు టీమిండియా కెప్టెన్ శుభాకాంక్షలు తెలిపాడు. అద్భుతంగా ఆడారని అభినందించాడు.

సోమవారం వెస్టిండీస్‌, పాకిస్తాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబర్ ఆజామ్‌ను విలేకరి ఓ ప్రశ్న అడిగారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ గురించి అడగకుండా టీ20 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఏం మాట్లాడారని విలేకరి ప్రశ్నించాడు.

బాబార్ ఆజామ్ సమాధానం ఇస్తూ.. అవును. మేం మాట్లాడుకున్నాం. కానీ, ఆ విషయం అందరి ముందు చెప్పలేను అని పేర్కొన్నాడు.