కొవిడ్ మహమ్మారి కారణంగా తమ రాష్ట్రంలో 10వేలకు పైగా మంది మరణించారని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకున్నది. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందజేసినట్లు తెలిపింది. కరోనా మరణాలకు సంబంధించిన జాబితాను సోమవారం సుప్రీంకోర్టుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. కొవిడ్ మరణాలకు నష్టపరిహారం చెల్లిస్తున్న విషయంపై విస్తృత ప్రచాం చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తద్వారా మారుమూల గ్రామాల్లో నివసించే వారు సైతం తెలుసుకుంటారని పేర్కొన్నది.
కొవిడ్ కారణంగా 10,098 మంది మృతిచెందినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆ సంఖ్య 19,964కు చేరుకున్నది. దేశ వ్యాప్తంగా కొవిడ్ కారణంగా 4.85 లక్షల మంది మరణించారు. ఇందులో గుజరాత్ రాష్ట్రంలో మృతుల సంఖ్య 2శాతంగా ఉన్నది.
రూ.50వేల పరిహారం కోసం మొత్తం 34,678 దరఖాస్తులు గుజరాత్ ప్రభుత్వానికి అందాయి. ఇందులో 19,964 మందికి పరిహారం అందజేశారు.