సాలి పురుగులతో చాలా ప్రమాదం.. ఇంట్లో ఉంటే ఇలా చేసేయండి..!

-

సాధారణంగా..స్టోర్ రూమ్స్ లో, ఇంటి మూలల్లో అక్కడక్కడ సాలీడు గూళ్లు ఉంటాయి. మనం అ‌వి ఉన్నప్పటికీ..చేత్తోనే పక్కను అనేసి స్టోర్ రూమ్స్ లాంటి ప్రదేశాల్లో అయితే మనకు ఏదైనా పని ఉంటే చూసుకుంటాం..వాటిని పెద్దగా ప్రమాదకరంగా కూడా పట్టించుకోం. ఎక్కువ ఉంటే..అప్పుడు క్లీన్ చేయిస్తారు..కానీ అసలు ఎంత డేంజరో తెలుసా? అసలు ఇవి ఇంట్లో ఉండటం మంచిది కాదట. సాలెపురుగులు మీ ఇంట్లో ఉంటే ఈ విధంగా చేసి వాటని వెళ్లగొట్టండి..!

వారానికోసారి ఇళ్లు శుభ్రం చేయాలి..

ఏ పండగకో కాకుండా..వారానికి ఒకసారి ఇళ్లు క్లీన్ చేస్తూ ఉండటం అలవాటుగా పెట్టుకోండి. అలా చేయకుంటే.. సాలీడులు ఇష్టమొచ్చిన దగ్గర దాని సంతతిని అభివృద్ధి చేస్తాయి. కానీ మీరు ప్రతి వారం ఇంటిని శుభ్రం చేస్తే సాలెపురుగులు మీ ఇంటిని వదిలివేస్తాయి.

ఇంటి బయట శుభ్రం

సాలెపురుగులు ఇంట్లో గూళ్లు కట్టుకుంటాయి కానీ అవి మీ ఇంటి బయట కూడా పెద్ద గ్యాంగ్ నే మెయింటేన్ చేస్తాయని మీకు తెలుసా? సాలెపురుగులు సాధారణంగా ఇంటి మూలలు, బాల్కనీలను ఎంచుకొని గూళ్లు కట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి కీటకాలను పట్టుకోవడానికి మంచి ప్రదేశాలు. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.సాలె పురుగుల నుంచి మీ ఇంటిని కాపాడుకోవాలంటే అవి ఎక్కడకనిపిస్తే అక్కడ చీపురుతో శుభ్రం చేయాలి. దీంతో మీ ఇల్లు అన్ని సమయాలలో చక్కగా కనిపిస్తుంది.

పుదీనా నూనె స్ప్రే

మీరు ఇంటి మూలల్లో పుదీనా నూనె స్ప్రే చేస్తే సాలీడులు పారిపోతాయి. ఎందుకంటే సాలీడు దీని వాసనను అసలు భరించలేదు. ఇంటి మూలల్లో పుదీనా ఆయిల్ స్ప్రే చేస్తే సాలెపురుగులు తొలగిపోవడం కాయమంటున్నారు నిపుణలు.

నీటిని పిచికారీ

మీ ఇంటి వెలుపల స్పైడర్ వెబ్‌లు కనిపిస్తే వెంటనే పైప్‌ ద్వారా నీటితో వాటిని తొలగించాలి. మరొసారి అవి అక్కడికి రాకుండా ఉంటాయి.

ఇలాంటి చిన్న చిట్కాలతో సాలి పురుగులు మీ ఇంట్లో లేకుండా చేసుకోవచ్చు. సాలిపురుగులు ఇంటి మూలాల్లో ఉంటే..ఇంటి లుక్ నే మార్చేస్తాయి. చూడ్డానికి ఏ మాత్రం బాగుండదు.

Read more RELATED
Recommended to you

Latest news