మనిషికి సమయస్పూర్తి చాలా అవసరం. టైమ్‌కు తగ్గట్టు స్మార్ట్‌గా నిర్ణయాలు తీసుకోవాలి. చాలా మందికి ఇమిడీయట్‌గా ఒక స్విచ్చువేషన్‌కు రెస్పాండ్ అవడం తెలియదు. దానివల్ల చాలా నష్టపోతారు. అనుకోని ఒక ఘటన జరిగినప్పుడు చేయకూడని పనులు చేస్తే దాని వల్ల లాభం కంటే లాస్ ఎక్కువగా ఉంటుంది. పాము కరిచినప్పుడు చాలా మంది ఏం చేస్తారు. వెంటనే కరిచిన చోట కట్టుకడతారు. ఇక్కడ వరకూ ఓకే. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు కొన్ని చేయాల్సినవి చేయకూడనివి ఉంటాయి. వాటిల్లో మెయిన్ పాము కరిచిన వ్యక్తిని నీళ్లు తాగించడం, కరిచిన చోట పైన కింద బ్యాండేజ్ వేయడం. అసలు ఇలా చేయడం మంచిదే అనుకుంటున్నారా.?
పాము కరచిన వ్యక్తికి నీరు తాగిస్తే.. రక్తం పలచబడి విష ప్రభావం పోతుందని కొంతమంది చెబుతుంటారు. అయితే ఇది ఎంతమాత్రం నిజం కాదని వైద్యులు చెబుతున్నారు. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలి. పాము కరచిన ప్రదేశంలో సబ్బుతో నాలుగైదు సార్లు కడగాలి. యాంటీసెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేస్తే కొంతవరకు విష ప్రభావం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఆ భాగాన్ని కదలించకూడదు.
కట్టుకట్టడం కూడా తప్పే..
కొంతమంది పైన కింద బ్యాండేజి కడతారు. అలా అసలు చేయకూడదట. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పాము కరిచిన వ్యక్తిని భయపెట్టకూడదు. చుట్టుపక్కల వారు బాధితుడిని మానసికంగా భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అది పాము విషం కంటే చాలా ప్రమాదకరం. అందుకే పాము కాటుకు గురైన వ్యక్తికి సాధ్యమైనంత ధైర్యం చెప్పాలి. అంతేకాక కొంతమంది తెలియక నాటు మందులు, ఆకు పసరు తాగిస్తుంటారు. అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.
నోటితో పీల్చేయడం..
పాము కరిచిన వెంటనే భయంతో పరుగెత్తితే విషం మరింత వేగంగా గుండెకు చేరి త్వరగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పాము కరిచిన చోట పెద్దగా గాయం చేసి విషాన్ని నోటితో పీల్చి ఉమ్మివేయడం కూడా మంచిది కాదు. దీని వల్ల గాయం పెద్దదై విషం చర్మంతోపాటు చుట్టుపక్కల ఉన్న కణాల్లోకి వ్యాపించి త్వరగా గుండెకు చేరుతుంది. నొప్పి తగ్గేందుకు ఎలాంటి మందులు వాడొద్దు. కాటు వేసిన భాగం నుంచి నోటితో రక్తం పీల్చకూడదు. ఆ ప్రాంతంలో కణజాలాన్ని కత్తితో కత్తిరించడం సరికాదు. పాము విషం లాలాజల స్రావం రకం, ఇది ఎరను చంపడానికి జీర్ణం చేయడానికి ఉపయోగించబడుతుంది. దీని ప్రభావం నేరుగా నరాలపై పని చేస్తుంది. ఐస్ అస్సలు వేయకుండా జాగ్రత్త వహించండి. దీనివల్ల విషం పేరుకుపోయి ప్రాణాంతకంగా మారుతుంది. యాంటీ-వెనమ్ ఇంజెక్షన్ సకాలంలో చికిత్స చేస్తే, హానిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.