మీ పిల్లలకు పాస్ వర్డ్ పెట్టారా? లేదా? అయితే ఇప్పుడే పెట్టేయండి

-

రితిక అనే చిన్నారి వయసు ‘8 ఏళ్లు. అదే స్కూల్ లో చదువుతున్న రితికను స్కూల్ లో దింపడం, సాయంత్రం 4 గంటలకు వచ్చి తీసుకెళ్లడం.. అన్నీ తన తల్లే స్వయంగా చూసుకునేది. ఒకరోజు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రితిక తల్లి స్కూల్ కు రావడం ఆలస్యమైంది. 4 దాటినా తన తల్లి ఇంకా రాకపోవడంతో తన తల్లి కోసం వేచి చూస్తోంది రితిక.

పిల్లలకు పాస్ట్ వర్డ్ ఏంటి? పిల్లలేమన్నా మొబైలా? లేక కంప్యూటరా? అని అనకండి. కంప్యూటర్, మొబైల్ కంటే కూడా మీ పిల్లలు చాలా ముఖ్యం. వాటిలో డేటా పోయినా పెద్ద సమస్యేమీ కాదు. అవే పోయినా పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ.. మీ పిల్లలకు ఏమైనా అయితే. అప్పుడు మీరు మీ జీవితాన్నే కోల్పోవాల్సి ఉంటుంది. అర్థం కాలేదు.. కొంచెం క్లారిటీగా చెప్పండి.. అంటారా? అయితే.. ముందు ఇది చదవండి..

ఢిల్లీలోని వివేకానంద నగర్ లో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. రితిక అనే చిన్నారి వయసు ‘8 ఏళ్లు. అదే స్కూల్ లో చదువుతున్న రితికను స్కూల్ లో దింపడం, సాయంత్రం 4 గంటలకు వచ్చి తీసుకెళ్లడం.. అన్నీ తన తల్లే స్వయంగా చూసుకునేది. ఒకరోజు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రితిక తల్లి స్కూల్ కు రావడం ఆలస్యమైంది. 4 దాటినా తన తల్లి ఇంకా రాకపోవడంతో తన తల్లి కోసం వేచి చూస్తోంది రితిక.

అయితే.. ఓ వ్యక్తి స్కూల్ బయటి నుంచి రితికను చాలా సేపు నుంచి గమనిస్తున్నాడు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. దీంతో ఆ చిన్నారి వద్దకు వెళ్లి.. మీ అమ్మకు అర్జెంట్ పని ఉండి స్కూల్ కు రాలేకపోయింది. నన్ను తీసుకురమ్మంది. పదా.. ఇండికి వెళ్దాం.. అని ఆ చిన్నారిని ఎత్తుకోబోయాడు ఆ వ్యక్తి.

అంతే.. వెంటనే ఆ పాప.. అయితే.. పాస్ వర్డ్ చెప్పు.. అని అడిగింది. దీంతో ఆ దుండగుడికి ఏం అర్థం కాలేదు. పాస్ వర్డ్ ఏంటి. మీ మమ్మీ పాస్ వర్డ్ ఏం చెప్పలేదన్నాడు. వెంటనే తనకు అర్థం అయింది. వీడు తనను కిడ్నాప్ చేయడానికి వచ్చాడని తెలుసుకొని గట్టిగా అరిచింది. దీంతో చుట్టుపక్కన ఉన్న వాళ్లు అక్కడి చేరుకొని కిడ్నాపర్ ను పోలీసులకు పట్టించారు. అది.. దీన్ని బట్టి మీకు ఏం అర్థమయింది. పాస్ట్ వర్డ్ అనేది ఆ పాపను రక్షించింది.

ఆ తల్లి, బిడ్డ ఇద్దరు కలిసి ఓ పాస్ వర్డ్ పెట్టుకున్నారన్నమాట. ఎప్పుడైనా తను రావడం లేటయినా.. ఒకవేళ రాలేకపోయినా.. ఎవరినైనా పంపించినప్పుడు.. పాస్ వర్డ్ చెప్పాలని చెప్పి ఆ తల్లి ముందే తన కూతురుకు చెప్పింది. అందువల్లే ఆ పాప.. కిడ్నాపర్ చెర నుంచి తప్పించుకోగలిగింది.

అందుకే మీరు కూడా మీ పిల్లలకు ఓ పాస్ వర్డ్ పెట్టండి. అది మీకు, మీ పిల్లలకు తప్పించి ఇంకెవ్వరికీ తెలియకూడదు. దీని వల్ల మీ పిల్లలను గుర్తు తెలియని వ్యక్తుల చెర నుంచి కాపాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news