పాత ఫోన్లను ఇంట్లో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?

-

ఏదైనా పాత, పనికిరాని వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనెర్జీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అదే విధంగా ఎలక్ట్రిక్ వస్తువులు కూడా నెగెటివిటీని కలిగి ఉంటాయి. అవి వినియోగంలో ఉన్నప్పుడు ఎంత ప్రయోజనాలను కలిగి ఉంటాయో.. వాటిని పక్కన పెట్టిన తర్వాత అంత కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని ఎలక్ట్రికల్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు..

సమయానికి సక్రమంగా ఉపయోగించాలి, సమయం ముగిసినప్పుడు వాటిని పడేయటం మంచిది. చెడిపోయినవాటిని ఇంట్లో దాచుకోవడం అంత మంచిది కాదని.. తయారు చేసిన ప్రతి వస్తువుకు గడువు తేదీ ఉంటుంది. అది ఏమైనప్పటికీ. కాల పరిమితి ముగిసినప్పుడు.. దాని వల్ల కలిగే నష్టాలు మనకు కనిపిస్తుంటాయి. అది ఆ వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. దాని నష్టాలు తక్కువ లేదా ఎక్కువ. ఆ వస్తువు ఎలక్ట్రిక్ వస్తువు అయితే అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. వాటి వల్ల కలిగే నష్టం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

*. మొబైల్స్‌లో ఉపయోగించే బ్యాటరీలో లిథియం అయాన్ ఉంటుంది. ఇది కొంతకాలం తర్వాత హానికరం. ముఖ్యంగా మొబైల్ బ్యాటరీ ఉబ్బినప్పుడు మరింత ప్రమాదకరంగా మారుతాయి. ఇలా ఉబ్బిన మొబైల్ బ్యాటరీలు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

*. చాలా కాలం వాడిన తర్వాత సాకెట్లు పాడవుతాయి. అప్పుడు అవి మరింత హానికరంగా మారతాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది..

*.పాత ఛార్జర్లు తయారు చేయడానికి సర్క్యూట్ బోర్డ్ ఉపయోగించబడుతుంది. ఇది గ్లాస్ ఫైబర్ మూలకంతో తయారు చేస్తారు. అవి చాలా పాతవి అయితే అవి పేలుడు లేదా మంటలకు కారణమవుతాయి. అవి పాతవి లేదా దెబ్బతిన్నట్లయితే వాటిని తీసివేయడం చాలా మంచిది.

*. ఆఖరిగా మీ ఇంట్లో బల్బ్ లేదా ట్యూబ్ లైట్ పాడైతే, దానిని వెంటనే ఇంటి నుండి బయట పడేయండి. ఇంట్లో ఉంచినప్పుడు, అది రసాయనిక లోహంతో తయారు చేయబడి.. దీనితో వాయు కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మన ఇంట్లోని పెద్దవారిపై చిన్న పిల్లలపై అధిక ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
ఎలక్ట్రిక్ వస్తువులకు కూడా వాటి ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే సమయానికి సరిగ్గా ఉపయోగించాలి..ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే..ఎంతవరకు బాగుంటే అంతే వాడాలి..లేకుంటే నష్టాలే ఎక్కువ..

Read more RELATED
Recommended to you

Latest news