అమ్మాయిలు ఇదే మీకే.. మీ లవర్ కు మీ పై ఉన్నది ప్రేమా లేక కోరిక అని తెలుసుకున్నారా..!

ఈ రోజుల్లో ప్రేమలో పడటం చాలా మామూలు విషయం..అయితే చాలామందిలో నిజమైన ప్రేమ ఉండటంలేదు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల బ్యాక్ గ్రౌండ్ చూసి ప్రేమిస్తే..మరికొంతమంది అబ్బాయిలు అమ్మాయిల బాడీ చూసి ప్రేమిస్తున్నారు. కానీ వీళ్లు పైకి అలా అస్సలు ఉండరు. అదే కదా సమస్య. ప్రేమించే ప్రతిఒక్కరూ ఈ తరహావాళ్లే అనికాదు..కొందరు ప్రేమకోసం ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు, పిచ్చోళ్లు అయిన వాళ్లు ఉన్నారు. అయితే కామన్ గా ప్రేమించే ప్రతి అమ్మాయికి ఏదో ఒక క్షణంలో ఒక డౌట్ వస్తుంది. తను నన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడా, లేదా కోరిక తీర్చుకోవటానికే రిలేషన్ షిప్ లో ఉంటున్నాడా అని..నోరుతెరిచి అడిగితే..ఒకవేళ ఆ అబ్బాయిది ట్రూలవ్ అయితే హట్ అవుతాడు, లేనిపోని లొల్లి..మరి ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. మీరు ఇదే డైలమాలో ఉన్నారా..అయితే ఆర్టికల్ చదివేయండి. మీకు పిచ్చక్లారిటీ వచ్చేస్తుంది.

lovers

మీరు ప్రేమలో ఉన్నారంటే..మీ లవర్ ఏ మీకు మంచి స్నేహితుడు. మీ ఇందరిమధ్య మాట్లాడుకోవటానికి టైం సరిపోదు..అదేదో సినిమాలో చెప్పినట్లు గంటలు క్షణాల్లా గడిచిపోతాయ్. ఒక్కసారి ఫోన్ చేశాడంటే..ఇట్టే సమయం గడిచిపోతుంది. తనతో ఎంత మాట్లాడినా తనివితీరదు. ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్ ది కోరిక అయితే ఇలా ఎక్కువసేపు మాట్లాడటానికి ఇష్టపడరు. ఒకవేళ మాట్లాడినా ఎక్కువ సెక్స్ టాపికే తీసుకొస్తాడు. సో ఇలా అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది. కానీ ప్రతిసారి ఈ తరహా సంబాషణకే ప్రాధాన్యం ఇస్తున్నాడంటే మీరు గమనించుకోవాల్సి ఉంటుంది మరి.

బెడ్ పై మీతో ఎక్కువ సమయం గడపాలనుకునేవారు : మీ ప్రేమికుడు మీతో బెడ్ మీదే ఎక్కువ సేపు గడపాలని ప్రయత్నిస్తుంటే, వారు ఎప్పుడూ మీతో లైంగికపరమైన ప్రస్తావన తెస్తుంటే, మిమ్మల్ని శారీరక కోణంలోనే చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారు మీతో కేవలం లైంగిక పరమైన సంబంధాన్ని కోరుకుంటున్నట్లే.. అయితే, ఇలా చేయడం తప్పేమీ కానప్పటికీ, వారు మిమ్మల్ని కేవలం లైంగిక కోణంలోనే చూడటం అనేది మంచివిషయం కాదుగా. మీ పట్ల ప్రేమతో ఉన్న వ్యక్తి మీతో సమయాన్ని అన్ని విధాలుగా గడపాలి కానీ కేవలం ఆ కోరిక ఉండకూడదని గుర్తించుకోండి.

ఎప్పుడూ లైంగిక ప్రస్తావన తెచ్చేవారు.. : ఒకరు నిజంగా మీతో ప్రేమలో ఉన్నప్పుడు, మీ అవసరాలు, లక్షణాలు, వ్యక్తిత్వం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ పట్ల ఎప్పుడూ ప్రేమ చూపిస్తూ, మిమ్మల్ని సంతోషపర్చాలని చూస్తారు. అంతేకాక, వారు మీ పట్ల శ్రద్ధ వహిస్తూ మీ గొప్ప లక్షణాలను ఎప్పుడూ మెచ్చుకుంటారు. ఏం చేస్తే సంతోషిస్తుంది అని ఇంతా తనకు ఏమైన బాధకలిగించే విషయాలు ఉంటే మీతోనే పంచుకుంటారు. కానీ, మీ ప్రియమైన వారు దీనికి భిన్నంగా ఎప్పుడూ శృంగారం గురించి మాత్రమే ప్రస్తావిస్తుంటే వారి పట్ల జాగ్రత్త వహించడం మంచింది.

భౌతిక రూపానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం : ఒక వ్యక్తి మీ వ్యక్తిత్వానికి బదులు భౌతిక రూపానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వారు మిమ్నల్ని లైంగికపరమైన కోరికతోనే చూస్తున్నారని అర్థం.అంటే మీరు దూరంగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా కలిసినప్పుడు మాత్రమే ఎక్కడలేని ప్రేమికురిపించటం. వారు మీ వ్యక్తిత్వం పట్ల కాకుండా మీ ముఖం, శరీరం ఆకృతిని చూసి ఇష్టపడుతున్నారని తెలుసుకోండి. ఈ లక్షణాలు మీ పట్ల ప్రేమ లేని సంబంధంలో మాత్రమే ఉంటుంది.

కట్టుబాట్లు లేనివారు : శృంగారం కోసం మాత్రమే సంబంధంలో ఉన్న వ్యక్తి కట్టుబాట్లను పట్టించుకోడు.భవిష్యత్తు గురించి పెద్దగా మాట్లాడరు. సమాజంలోని సామాజిక కట్టుబాట్లు, సాంప్రదాయాలకు విలువనివ్వకుండా కేవలం మీతో లైంగిక సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే, వారు ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ తోడుంటూ, భవిష్యత్తును పంచుకోవడం గురించి, కట్టుబాట్ల గురించి ఎక్కువ ఆలోచించిస్తాడు.

మీ కుటుంబం నుంచి మిమ్మల్ని దూరం చేసేవారు : మీ ప్రేమికుడు మీ పట్ల ప్రేమతో ఉన్నారా? లేదా కోరికతో ఉన్నారా? అనేది నిర్ణయించడానికి ఈ అంశం బాగా పనిచేస్తుంది. మిమ్మల్ని మీ కుటుంబం, స్నేహితుల నుంచి దూరం చేయడానికి వారు ప్రయత్నిస్తే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఇష్టపడుతూ మీతో జీవితం పంచుకోవాలి అనుకునే వారు, మీ కుటుంబం నుంచి ఎప్పుడూ మిమ్మల్ని విడదీయరు.

ఇదండి మ్యాటర్..మీ లవర్లో ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త ఆలోచించి ఇక ముందడుగువేయండి. ప్రేమలో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకునేవాళ్లు చాలామంది ఉంటారు. వాళ్ల పాట్నర్ గురించి సరిగ్గా అర్థంచేసుకోలేక ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయ్.

– Triveni Buskarowthu