గండి మైసమ్మ గుళ్ళో… విస్కీ బాటిల్ తో వర్మ హల్చల్ !

రామ్ గోపాల్ వర్మ… వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఏంచేసినా సంచలనమే. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తారు వర్మ. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొండ చిత్రం కోసం వరంగల్ జిల్లాలో పర్యటించిన రామ్ గోపాల్ వర్మ… వంచనగిరి గ్రామంలోని గండిమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .

ఈనేపథ్యంలో అమ్మవారికి మద్యం తాగించాడు రామ్ గోపాల్ వర్మ. అక్కడి సంస్కృతి ప్రకారం గండి మైసమ్మ అమ్మవారికి మద్యం తాగించారు. ఆ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే అమ్మవారికి మద్యం తాగించిన ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు… తెగ కామెంట్లు పెడుతున్నారు. కొందరు రామ్ గోపాల్ వర్మ ను మెచ్చుకుంటే.. మరికొందరేమో… ఆయన పై ఫైర్ అవుతున్నారు. అమ్మ వారికి మందు తాగించడం ఏంటని మండిపడుతున్నారు. కాగా ప్రస్తుతం రాంగోపాల్ వర్మ… కొండా మురళి జీవితం ఆధారంగా కొండా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.