మీ దగ్గర ఉన్న ఏటీఎం గురించి ఈ విషయాలు తెలుసా?

-

డబ్బులు పొదుపు చెయ్యాలన్నా, దాచుకోవాలన్నా కూడా బ్యాంకు అకౌంట్ తప్పనిసరి..అందుకే ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు.బ్యాంకులో ఖాతా తెరిచినప్పుడల్లా ఖాతాదారునికి పాస్‌బుక్‌తో పాటు డెబిట్ కార్డును అందిస్తారు. దీని సహాయంతో ప్రజలు ఏటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చు..ఈరోజు మన దేశంలో వుండే టాప్ బ్యాంకుల గురించి ఈ విషయాలను తెలుసుకుందాం..

డెబిట్ కార్డ్ ద్వారా ప్రజలు ఏటీఎం మెషిన్ నుంచి నగదు తీసుకోవచ్చు. ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడానికి డెబిట్ కార్డ్ మాత్రమే అవసరం. మీరు తీసుకున్న నగదు మీ ఖాతా నుంచి కట్‌ అవుతుంది. ఒక నెలలో డెబిట్ కార్డ్ నుంచి నగదు విత్‌ డ్రా చేయడానికి పరిమితి ఉంటుంది. ఎక్కువ లావాదేవీలు చేస్తే అదపసే ఛార్జీ విధిస్తారు.

బ్యాంకుల ద్వారా డెబిట్ కార్డ్ హోల్డర్‌కు అనేక ఆఫర్‌లు ఉంటాయి. ఇవి బోనస్ పాయింట్‌లు, క్యాష్ బ్యాక్, ఉచిత బీమా కవరేజ్, సేకరించిన పాయింట్‌ల కోసం రిడీమింగ్ ఆప్షన్‌లని అందిస్తాయి. ఈ సందర్భంలో మీరు టాప్ కంపెనీ ఏటీఎం తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా బ్యాంక్‌లో ఖాతా తెరిచేటప్పుడు డెబిట్ కార్డ్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి..లేదంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు..

ఇక ఇండియాలో బెస్ట్ డెబిట్ కార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

1. ఎస్బీఐ డెబిట్ కార్డు

2. ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్ కార్డు

3.హెచ్ డి ఎఫ్ సి డెబిట్ కార్డు

4.యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్

5. ఎస్ బ్యాంక్ డెబిట్ కార్డ్
6. కోటక్ మహీంద్రా డెబిట్ కార్డ్
7.హెచ్ఎస్బిసీ డెబిట్ కార్డ్
8. కెనరా బ్యాంక్ డెబిట్ కార్డ్
9. బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డ్
10. బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్

ఈ బ్యాంకుల కార్దులు వల్ల ఎటువంటి సమస్యలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక్కో బ్యాంకుకు ఒక్కో చార్జీని వసూల్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news