ఈ ఏడాది టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లైగర్ ఆగస్ట్ 25న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వసూళ్లు సాధించలేదని డిస్ట్రిబ్యూటర్స్ గొడవ చేశారు. అది వివాదంగా మారిన విషయం విదితమే. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు 11 గంటల పాటు విచారించారు. లైగర్ సినిమా ఆర్థిక లావాదేవీలపై విజయ్‌ను ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం విజయ్ దేవరకొండ ఇంటికి తిరిగి వెళ్లారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. వాళ్లు రమ్మన్నారు.. నేను వెళ్లాను అని తెలిపారు. నా జీవితంలో ఇదో అనుభవం అంటూ పేర్కొన్నారు. ఈడీకి పూర్తిగా సహకరించాను. మళ్లీ రమ్మని చెప్పలేదని విజయ్ స్పష్టం చేశారు. ఇటీవల పూరీ జగన్నాథ్, ఛార్మిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమా నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో వారుచిత్ర యూనిట్‌కి నోటీసలుచ్చి విచారణకు పిలిచారు. ఇప్పటికే దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్‌తో పాటు సినిమాలో మరో నిర్మాతగా ఉన్న ఛార్మి కూడా విచారణకు హాజరైంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు.