ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే… ఆ పార్టీయే అధికారంలోకి..!

-

ఇప్పటివరకు ఈ సెంటిమెంట్ బ్రేక్ కాలేదు. మరి.. ఈసారి ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా? అయ్యే చాన్సెస్ ఉన్నాయా? లేక 35 ఏళ్ల నుంచి కొనసాగుతున్న అదే సెంటిమెంట్ 2019 లోనూ కొనసాగుతుందా?

సెంటిమెంట్ ఎట్ పీక్స్ అంటారు కదా. అదే ఇది. ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంట్ కోసం కొందరు ఏదైనా చేస్తారు. సెంటిమెంటే తమను నడిపిస్తోందని భావిస్తుంటారు. ఇక.. ఎన్నికల విషయంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నామినేషన్లు వేసేముందు, ఎన్నికల ప్రచారం ముందు, గెలిచిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసేముందు.. ఇలా ప్రతి విషయంలోనూ సెంటిమెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

Do you know Vishakapatnam south sentiment story

అయితే.. ఏపీలో కూడా ఓ సెంటిమెంట్ నడుస్తోంది. ఇప్పుడు కాదు 1983 నుంచి ఆ సెంటిమెంట్ కొనసాగుతోంది. అదే విశాఖ దక్షిణ నియోజకవర్గం. ఇక్కడ ఏ అభ్యర్థి గెలిస్తే.. ఆ అభ్యర్థి పోటీ చేసిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. పునర్విభజనకు ముందు ఉన్న విశాఖ 1 నియోజకవర్గం నుంచి కూడా ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది. పేరు మారి విశాఖ దక్షిణ నియోజకవర్గంగా మారినా అదే సెంటిమెంట్ కూడా కొనసాగుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు ప్రతిపక్షంలో కూర్చోలేదు అంటే చూడండి ఈ నియోజకవర్గం ఎంత ప్రభావం చూపుతోందో.

రాష్ట్ర విభజనకు ముందు..

టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గ్రంధి మాధవి గెలుపొందారు. అప్పుడు టీడీపీలోకి అధికారంలోకి వచ్చింది. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి అల్లు భానుమతి గెలుపొందారు. అప్పుడూ టీడీపీనే అధికారంలోకి వచ్చింది.



1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈటీ విజయలక్ష్మీ ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు.. కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది.

1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్ఏ రహ్మన్ టీడీపీ అభ్యర్థి గెలిచారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది.

1999 ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో టీడీపీ ఎన్నికల బరిలో దిగగా… పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబుకు టికెట్ వచ్చింది. ఆయనే గెలిచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.

2004 ఎన్నికల్లో ద్రోణంరాజు సత్యనారాయణ అనే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

2005 డిసెంబర్ లో ద్రోణంరాజు సత్యనారాయణ మృతి చెందారు. దీంతో 2006 లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ గెలిచారు.

2009 ఎన్నికల ముందు నియోజకవర్గ పునర్విభజన జరిగి విశాఖ ఒకటో నియోజకవర్గం కాస్త విశాఖ దక్షిణ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ద్రోణం రాజు శ్రీనివాస్ రెండోసారి విజయం సాదించారు. అప్పుడూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

రాష్ట్ర విభజన తర్వాత..

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వాసుపల్లి గణేశ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

ఇలా… ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే. ఆ పార్టీయే అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. మరి.. ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగుతుందా? లేదా? అంటే మే 23 దాకా వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news