థమన్ కు మెసేజ్ చేసిన సమంత.. ఏమని తెలుసా?

పెళ్లి తర్వాత తన భర్త నాగచైతన్యతో కలిసి తను నటిస్తున్న ఫస్ట్ సినిమా మజిలీ. సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. అయితే.. తన భర్తతో పెళ్లయ్యాక మొదటిసారి నటిస్తున్న ఈ సినిమాకు కొన్ని చిక్కులు వచ్చాయట.

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. తమిళంలోనూ అందరితో మంచిగా ఉంటుంది సమంత. తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎంత మార్కెట్ ఉందో.. తమిళంలోనూ అంతే మార్కెట్ ఉంది. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్. సహజంగా పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్ల సినీ కెరీర్ ఆగిపోతుంది. కానీ.. సమంత కెరీర్ పెళ్లి తర్వత ఇంకా పుంజుకుంది. పెళ్లి తర్వాత కూడా సమంత చాలా సినిమాల్లో నటించింది.

అయితే.. పెళ్లి తర్వాత తన భర్త నాగచైతన్యతో కలిసి తను నటిస్తున్న ఫస్ట్ సినిమా మజిలీ. సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. అయితే.. తన భర్తతో పెళ్లయ్యాక మొదటిసారి నటిస్తున్న ఈ సినిమాకు కొన్ని చిక్కులు వచ్చాయట. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఉన్నాడు కదా… ఆయన తన రెమ్యూనరేషన్ తీసుకొని రీరికార్డింగ్ చేయలేదట. హ్యాండ్ ఇచ్చాడట. దీంతో చిత్ర బృందానికి ఏం చేయాలో అర్థం కాలేదట. దీంతో కొంత రెమ్యూనరేషన్ ఇచ్చి థమన్ కు రీరికార్డింగ్ బాధ్యతలు అప్పగించారట.

అసలే లవ్ స్టోరీ. ఫీల్ గుడ్ మూవీ. రీరికార్డింగ్ చాలా ముఖ్యం. రిలీజ్ టైమ్ ఏమో దగ్గర పడుతుంది. దీంతో తమన్ రీరికార్డింగ్ ను రెండు వారాల్లో పూర్తి చేస్తాడా? ఎట్టా.. అంటూ టెన్షన్ పడినట్టుంది సమంత. వెంటనే థమన్ కు ఓ మెసేజ్ పంపించిందట.

తనకు, చైతూకు పెళ్లయిన తర్వాత వస్తున్న మొదట సినిమా మజిలీ అని.. దీనికి మంచి ఆర్ ఆర్ ఇవ్వాలని.. సినిమాను ఆర్ ఆర్ తో నిలబట్టే బాధ్యత మీదే.. అంటూ సమంత.. థమన్ కు మెసేజ్ పెట్టిందట.

అసలే స్టార్ హీరోయిన్.. మరోవైపు అక్కినేని కోడలు… మెసేజ్ పెట్టిన తర్వాత థమన్ ఊరుకుంటాడా? ఓ రేంజ్ లో ఆర్ ఆర్ ఇవ్వడూ. ఫీల్ గుడ్ సినిమాలకు ఆర్ ఆర్ ఇవ్వాలంటే థమన్ తర్వాతనే ఎవరైనా.. మరి మజిలీకి థమన్ న్యాయం చేస్తాడా? లేదా? అంటే వేచి చూడాల్సిందే.