జామకాయలకు పెద్దగా సీజన్‌తో పనిలేదు.. ఏడాదంతా లభిస్తాయి.. ఇంకా వీటిని ఇష్టపడని వాళ్లు కూడా ఎవరూ ఉండరు.. రోజూ ఒక్క జామకాయ తిన్నా చాలు ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషంట్లు అయితే రోజుకో ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలో.. జామకాయ కూడా అలా రోజుకోటి తినమని చెబుతుంటారు.
జామకాయలను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ ఉండవు. మలబద్దకం అన్నమాటే ఉండదు. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. అయితే జామకాయల్లో రెండు రకాలు ఉంటాయి.. లోపలి గుజ్జు పింక్ కలర్‌లో ఉంటుంది.. ఇంకోటి తెలుపు రంగుల్లో ఉంటుంది. అయితే వీటిల్లో ఏది మంచిది.. ఏ రంగు జామకాయలను తింటే ఏం జరుగుతుంది.. వీటి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..జనరల్‌గా వైట్ కలర్‌లో ఉండేవే రుచిగా ఉంటాయి.. పింక్ కలర్‌లో ఉండే జామకాయలు అంత రుచిగా ఉండకపోవడంతో తినడానికి పెద్దగా ఆసక్తి చూపించరు..
లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటే.. అందులో పిండి పదార్థాలు, విటమిన్ సి, విత్తనాలు అధికంగా ఉంటాయి. అదే పింక్ రంగులో గుజ్జు ఉంటే అందులో పిండి పదార్థాలు, విటమిన్ సి తక్కువగా ఉంటాయి. అలాగే విత్తనాలు కూడా తక్కువగానే ఉంటాయి. కానీ పింక్ రంగులో ఉండే జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కనుక మనకు పింక్ రంగులో ఉండే జామకాయలు కూడా ఉపయోగపడతాయి.బాక్టీరియా లేదా వైరస్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, దగ్గు, జలుబు, క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు తెల్ల రంగు జామకాయల కన్నా పింక్ రంగులో ఉండే జామకాయలను తింటేనే అధికంగా ఫలితం ఉంటుంది. ఆయా వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు.
పింక్ రంగులో ఉండే జామకాయల్లో కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి. కనుకనే ఆ జామకాయల గుజ్జు పింక్ రంగులో ఉంటుంది. పింక్ రంగు, తెలుపు రంగు.. రెండు రకాల జామకాయలను కూడా తింటుండాలి. అప్పుడే మనం జామకాయలతో అన్ని రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. కనుక మన ఆరోగ్యానికి రెండు రకాల జామకాయలు మంచివేనని.. రెండింటినీ తగిన మోతాదులో తినాలని.. వైద్యులు సూచిస్తున్నారు.