చైనా ప్లాస్టిక్ కుర్చీల మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?

-

మన రోజువారి జీవితంలో అనేక వస్తువులను చూస్తూ ఉంటాం. అయితే కొన్నింటిని చూడగానే చాలా ముచ్చటేస్తుంది. కొన్నింటిని అలా కాకుండా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా చాలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు సాధారణంగా చూసే ఉంటారు కుర్చీలకు ఇంకా స్టూల్ ల మధ్యలో చిన్నటి రంధ్రాలను గమనించి ఉంటారు కానీ ఆ రంధ్రం ఎందుకుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఆ రంధ్రం ఎందుకు ఉంటుందని.

 

మన నిత్య జీవితంలో కుర్చీలకు ఇంకా స్టూల్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. మరి అలాంటి వాటికి మధ్యలో రంధ్రం ఎందుకు ఉందని అడిగితే మనం వెంటనే చెప్పే సమాధానం ఒకచోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లడానికి చాలా సులభంగా ఉంటుందని.
ఇది నిజమే కానీ మనకి తెలియని ఇంకొన్ని విషయాలు. సాధారణంగా ప్లాస్టిక్ బల్లమీద రంధ్రాలు గుండ్రంగా ఉంటాయి.

ఇది బల్ల యొక్క నిర్మాణ సమగ్రతను కాపాడటమే కాకుండా మనం కూర్చున్నప్పుడు అది విరిగి పోకుండా ఉండటానికి సహాయ పడుతుంది. ఇది చదరపు ఆకారంలో ఉండటం వల్ల శక్తి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై పగుళ్లు వచ్చి విరిగి పోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకోసమే వాటిపై రంధ్రం గుండ్రటి ఆకారంలో ఉంటుంది. ప్లాస్టిక్ స్టూల్ లో రంద్రాలు లేకపోతే వాటిని పేర్చడం అసాద్యం. రంద్రాలు ఒక శూన్యతను నిరోధించడానికి, వాటిని పేర్చబడిన అప్పుడు గాలి పీడనాన్ని తగ్గించి వాటిని అమర్చుకునేందుకు వీలుగా ఉంటుంది. చూశారు కదా ఆ చిన్న రంధ్రం వల్ల మనకు తెలియని ఎంతటి సమాచారం దాగి ఉందో.

Read more RELATED
Recommended to you

Latest news