చాలా ప్రభుత్వాలు.. చాలా ప్రాజెక్టులను కట్టించాయి. సో వాట్.. దేనికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన గుర్తింపు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సాధారణ ప్రాజెక్టు అయితే అస్సలు కాదు. ఇదివరకు నిర్మించిన ఎన్నో ప్రాజెక్టులకు ఇది భిన్నం. పూర్తిగా భిన్నం. ఈ ప్రాజెక్టు లక్ష్యమే వేరు. ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రత్యేకతలు ఏ ప్రాజెక్టుకూ లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ వైపు ప్రపంచమంతా చూస్తోంది. ఈ ప్రాజెక్టును చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఔరా.. ఇంత భారీ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. చాలా రాష్ట్రాలు కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టును చూసి తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది అంటే అది కేవలం సీఎం కేసీఆర్ వల్లే.
అవును.. ప్రాణహిత చేవెళ్లగా శంకుస్థాపన జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ కు నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అనువుగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేశారు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే ఇంత భారీ ప్రాజెక్ట్ లేదు. అందుకే దీనికి నిర్మాణ దశ నుంచే ఊహించని రేంజ్ లో పేరొచ్చింది. మరి.. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఎందుకు అంత పేరు వచ్చింది. ప్రాజెక్టు విశేషాలు ఏంటి… ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చెప్పుకుందాం.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పేద్ద కొండనే తొలిచారు. సొరంగం నుంచి నీటిని తోడే పైపు కోసమే పేద్ద కొండను తొలిచారు. ఇంత పెద్ద సొరంగం ఇంతవరకు ఎక్కడా లేదు. దాదాపు 203 కిలోమీటర్ల మేర భూగర్భ కాలువలను తవ్వుతున్నారు. అంటే భూమి లోపల సొరంగం ద్వారా నీళ్లు ప్రవహించి చెరువులు, రిజర్వాయర్లలోకి చేరుతాయన్నమాట. కాలువను నిర్మించడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో ఇలా సొరంగాలు నిర్మిస్తున్నారు. గోదావరి నది మీద నిర్మించే బ్యారేజీల ద్వారా సాగు నీరు ముందుగా కాలువలకు వెళ్లి.. అక్కడి నుంచి చెరువులు, రిజర్వాయర్లకు వెళ్తుంది.
మొత్తం 3 బ్యారేజీలు, 19 పంపుహౌజులు, 20 జలాశయాలు, 14 సబ్ స్టేషన్లు.. ఇవే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించేది. అంతే కాదు.. సర్జ్ పూల్ ను భూమికి 127 మీటర్ల కింద నిర్మిస్తున్నారు. భూమి కింద నిర్మిస్తున్న భారీ పంపు హౌజులు నీటిని కాలువలోకి తోడి పోస్తాయి.
ఆ పంపులకు 139 మెగావాట్ల వరకు సామర్థ్యం ఉంది. కాలువల్లోకి నీటిని తోడటం కోసం పవర్ ను ఉపయోగించడానికి సపరేట్ గా 2 ఎకరాల స్థలంలో 440 కేవీల భూగర్భ సబ్ స్టేషన్ ను నిర్మిస్తున్నారు.
అంటే ఒక రోజుకు కనీసం రెండు టీఎంసీల నీళ్లను బయటికి తీసి తెలంగాణ ప్రాంతంలోని దాదాపు 18 లక్షల ఎకరాలను సాగు నీరు అందివ్వాలన్నదే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం. వీటన్నింటినీ నిర్మించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 80 వేల కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 18 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి.