దేశానికి అన్నం పెట్టే రైతన్న కలెక్టర్ కాళ్ల మీద పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్ లోని శివ్ పూరిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటన గత సంవత్సరం డిసెంబర్ 28న చోటు చేసుకున్నప్పటికీ.. దానికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అనుగ్రహ్ పీ కొత్తగా అపాయింట్ అయిన కలెక్టర్.. ఆఫీసు నుంచి కారు ఎక్కడానికి బయటికి వచ్చినప్పుడు ఆ రైతు ఒక్కసారిగా ఆమె కాళ్ల మీద పడ్డాడు. తన ఊళ్లో కరెంట్ లేక పొలాలు ఎండిపోతున్నాయని… కొత్త ట్రాన్స్ ఫార్మర్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నా అధికారులు దానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. తాను 40 వేల రూపాయలు డిపాజిట్ కూడా చేశానని కలెక్టర్ కాళ్లను పట్టుకొని వేడుకున్నాడు. దీంతో కలెక్టర్ వెంటనే లోకల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఆ ఊళ్లో కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని చెప్పడంతో వెంటనే ఆ రైతు ఊళ్లో ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.