మెటికలు విరిచినప్పుడు ఆ శబ్ధం ఎందుకు వస్తుందో తెలుసా.. అలా విరవటం మంచిదేనా..?

బాగా టైపింగ్ చేసినప్పుడో లేక ఎవర్ని అయినా ముద్దుచేసినప్పుడే మనం మెటికలు విరుస్తుంటాం. అప్పుడే మనకేదో తెలియని రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా టైప్ చేసినప్పడు కనక చేతివేళ్లతో అలా మెటికలు విరుచినట్లు చేస్తే భలే హాయిగా అనిపిస్తుంది కదూ. అయితే కొంతమందికి ఇది ఒక అలవాటుగా కూడా ఉంటుంది. మీరు గమనించారా.. మెటికలు విరిచినప్పుడు ఆ శబ్ధం ఎందుకు వస్తుందో..కొంతమంది అలా విరవటం అరిష్టం అంటారు.మరికొంతమంది ఇలా చేస్తే కీళ్లనొప్పు వస్తాయంటారు. వీటిల్లో నిజం ఎంతవరకూ ఉందో ఇప్పుడు తెలుసుుకుందాం.

మెటికలు విరిచినప్పుడు అంత శబ్ధం వచ్చినా నొప్పి ఎందుకు రాదో..

మన చేతివేళ్ళుకు ఎన్నో కీళ్లు(జాయింట్స్)తో కూడిన ఎముకలు ఉంటాయి. ఈ కీళ్లను జారుడు కీళ్లు అంటారు. మన చేతి వేల్లు అటు ఇటు కదలించినప్పుడు ఈ ఎముకల మధ్య ఘర్షణ వస్తుంది. అప్పుడు మన చేతికి నెప్పి వస్తుంది. ఇలా నెప్పి రాకుండా ఉండడం కోసం ఒక ఎముకుకు, మరో ఎముకుకు మధ్యలో ఒక చిక్కటి ద్రవం ఉంటుంది. దీనినే మ్యుకస్ అంటారట. అందువల్ల చేతివ్రేళ్ళు కదిలించిన ఈ ద్రవం వల్ల నెప్పిరాదు.

అసలు ఆ సౌండ్ ఎలా వస్తుందంటే..

మనం ఈ చేతి వ్రేళ్ళతో రోజులో ఎన్నో పనులు చేస్తాము. మనం ముందుగానే ఈ చేతివేళ్ల మధ్యలో ఓ ద్రవం ఉంటుందని చెప్పుకున్నాం కదా.. బాగా వేళ్లతో పనిచేసినప్పుడు ఈ ద్రవంలో చిన్ని చిన్ని గాలి బుడగలు ఏర్పడతాయి. మన చేతి వ్రేళ్ళు నొక్కినప్పుడు ఈ గలిబుడగలు పగిలి టప్ మనే శబ్ధం వస్తుంది. ఈ ప్రాసెస్‌ను ‘కేవిటేషన్’ అంటారు. జాయింట్ల మధ్య ఉండే వాయువులు తిరిగి కరగడానికి మళ్లీ 20-30 నిమిషాలు పడుతుంది. అందుకే ఒకసారి మెటికలు విరిచాక, మళ్లీ అరగంట దాక మీరు వేళ్లు విరుచుకోలేరు.

మెటికలు విరిస్తే కీళ్ల నొప్పులు వస్తాయా.?

డా.వాన్ ట్యుల్లేకన్ సమాధానం చెప్పారు. ఈ ప్రశకు బీబీసీ ప్రచురించిన కథనం ప్రకారం..మెటికలు విరిస్తే అలాంటివి రావనే తేలింది. అయితే వాళ్లేం చెప్పారంటే.. డా.డోనల్డ్ అన్జర్ అనే వ్యక్తి తన ఎడమ చేతివేళ్లను విరుచుకోవడం ఒక అలావటుగా ఉండేదట. అలా 50 ఏళ్లపాటు రోజుకు కనీసం రెండుసార్లు చేసేవారు. కానీ తన రెండు చేతులకూ కీళ్లనొప్పులు రాలేదు. వేళ్లు విరుచుకోవడం వల్ల ఆర్థరైటిస్ రాదని తన తల్లికి రుజువు చేశారు. అన్జర్ చేసిన ఈ ప్రయత్నానికి లేదా ప్రయోగానికి నోబెల్ బహుమతికి ప్యారడీ అవార్డుగా ఇచ్చే ఇగ్‌నోబెల్ అవార్డును 2009లో అందించారు. ఇదొక్కటే కాదు..ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. వేళ్లు విరుచుకోవటానికి కీళ్లనొప్పులకు సంబంధం లేదని స్పష్టం చేశాయి.

అలవాటుగా చేసుకోవటం మంచిది కాదు

కీళ్లనొప్పులు రావని ఇలా విరుచుకోవటం అలవాటుగా చేసుకోకూడదు.ఎందుకంటే, ఈ అలవాటుతో కొందరి చేతివేళ్ల జాయింట్ల వద్ద చిన్న క్రాక్ వచ్చినట్లు కొందరు రేడియాలజిస్టులు చెప్పారు. ఈ అలవాటు ఎక్కువగా ఉన్న కొందరిలో చేతి పటుత్వం బలహీనంగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది.

ఇదండి..వేళ్లు విరచటం, దానికి వచ్చే శబ్ధం వెనుక ఇంత కథ ఉందనమాట.