స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదో తెలుసా..?

మన పెద్దవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని.. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెప్పడం చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే అసలు స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా..?, మగవాళ్ళు మాత్రమే చేయాలా..? దీని వెనుక ఏమైనా కారణం ఉందా అనేది ఇప్పుడు మనం చూద్దాం.

 

చాలా మందికి ఈ సందేహం కలిగి ఉంటుంది. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడద చేస్తే ఏమవుతుంది అని.. అయితే నిజానికి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. దీనికి గల కారణం ఏమిటంటే మామూలుగా సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు వక్షస్థలం, చేతులు, కాళ్ళు, కళ్ళు నేలకు ఆన్చి అప్పుడు నమస్కారం చేయాలి.

అయితే స్త్రీల యొక్క ఉదరం గర్భాశయాన్ని కలిగి ఉంటుంది ఒకవేళ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేస్తే అది ఒత్తిడికి గురవుతుంది. దీని కారణంగా గర్భస్రావాలు మొదలైన సమస్యలు స్త్రీలలో వస్తాయి. అందుకనే సాష్టాంగ నమస్కారముని స్త్రీలు చేయకూడదు.

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకుండా పంచాంగ నమస్కారం చేయొచ్చు. పంచాంగ నమస్కారం లో కాళ్ళు చేతులు మాత్రమే నేలకు తగులుతాయి. అంతేకానీ సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని పండితులు చెప్పడం జరిగింది. కనుక చేయకపోవడమే మంచిది.