డబ్బే విలువైందనుకుంటున్నారా..? కానీ డబ్బు కంటే ఇవెంతో విలువైనవి..!

-

చాలా మంది డబ్బే విలువైనది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి. డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ డబ్బు ఉంటే అన్ని ఉండవు అని తెలుసుకోవాలి. డబ్బుంటే ఏదైనా సాధ్యం అని అనుకుంటే అది నిజంగా పొరపాటు.

 

డబ్బు కంటే విలువైనవి కొన్ని ఉన్నాయి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ మూడు విషయాలు డబ్బు కంటే చాలా ముఖ్యం పైగా వీటిని కోల్పోతే మనం మళ్లీ తెలుసుకోలేము.

మన మతం:

డబ్బు కంటే కూడా మతం ఎంతో పెద్దది. ఆర్థిక లాభాల కోసం మతాన్ని వదులుకోకండి. మతం మనకు ఎన్నో విషయాలను నేర్పుతుంది పైగా మనిషిని సరైన మార్గంలో మతం నడిపిస్తుంది కాబట్టి దీనికి విలువ ఇవ్వండి.

ఆత్మగౌరవం:

సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా చాలా ముఖ్యం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సినప్పుడు డబ్బు కోసం ఆత్మగౌరవాన్ని త్యాగం చేయద్దు. అది నిజంగా పెద్ద తప్పు. డబ్బు ని కోల్పోయినా మనం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోతే మనం మళ్లీ తీసుకురాలేము.

సంబంధాలు:

డబ్బులు కోల్పోతే మనం తెచ్చుకోవచ్చు కానీ సంబంధాలను కోల్పోతే తిరిగి మనం మళ్ళీ పొందలేము. ఒకరికి ప్రేమని, తోడుని..స్నేహితుడి,ని శ్రేయోభిలాషులుని, బంధువులని మనం కోల్పోతే మళ్ళీ తిరిగి తీసుకురాలేము. కానీ డబ్బులు కోల్పోతే మళ్ళీ మనం తీసుకురావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news