లిఫ్టులో బాలుడిని కరిచిన కుక్క.. చోద్యం చూసిన మహిళ.. వీడియో వైరల్

-

స్కూల్ నుంచి ఇంటికి వస్తూ అతనుండే సొసైటీ లిఫ్ట్ ఎక్కాడు ఓ బాలుడు. అప్పుడే అక్కడికి ఓ మహిళ తన పెంపుడు కుక్కతో వచ్చింది. అతడితోపాటే లిఫ్టులో ఎక్కింది. వెంటనే ఆ కుక్క బాలుడిపై ఎగబడి దారుణంగా కరిచింది.  లిఫ్టులో ఉన్న ఆ శునకం యజమాని చోద్యం చూసింది కానీ ఆ బాలుడిని కాపాడలేదు. అతడు కాలును పట్టుకొని బాధతో విలవిల్లాడుతూన్నా.. ఆ మహిళ మాత్రం తనకేమీ పట్టనట్లు నిర్దయగా వ్యవహరించింది. బయటకు వెళ్లే సమయంలోనూ ఆ శునకం మరోసారి దాడికి యత్నించింది. ఈ సంఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని ఓ హౌజింగ్‌ సొసైటీలో చోటుచేసుకుంది.

ఈ వీడియోను అకాశ్‌ ఆశోక్‌ గుప్తా అనే ట్విటర్‌ యూజర్‌ ట్వీట్‌ చేస్తూ.. ఎవరూ చూడకపోతే నైతికంగా ఉండాల్సిన బాధ్యతలేదా? అంటూ ప్రశ్నించారు. కాగా ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారడం వల్ల నెటిజన్లు ఆ మహిళపై మండిపడుతున్నారు. ‘అనైతికం, సిగ్గుచేటు.. మానవత్వాన్ని మరిచిపోతున్నారు. బాలుడి బాధను పట్టించుకోని ఆమెను ఏమనాలి?’ అంటూ ఓ నెటిజన్‌ ఘాటుగా స్పందించాడు. ‘అలా వ్యవహరించిన ఆ జాలిలేని మహిళను శిక్షించాలి’ అంటూ మరికొందరు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఘజియాబాద్‌ పోలీసులు స్పందించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ శునకం యజమానిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news