ఈసారి న్యూ ఇయర్ ని కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారా..? మన దేశంలో కాకుండా విదేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ విదేశాలలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకోండి. పైగా వీసా కూడా అవసరం లేదు మరి వీసా కూడా లేకుండా న్యూ ఇయర్ వేడుకలని ఎక్కడ చేసుకోవచ్చు ఏ విదేశాలలో చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.
మాల్దీవ్స్:
మాల్దీవ్స్ లో మీరు ఈసారి న్యూ ఇయర్ చేసుకోవచ్చు వీసా అవసరం లేదు ఇక్కడ ఖరీదైన రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటివి బాగా పర్యటకుల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. దీనికోసం మీ దగ్గర ఇండియన్ వీసా ఉండక్కర్లేదు. స్కూబా డైవింగ్, మాల్దీవులని చూడడం బాగా ఆకట్టుకుంటాయి.
థాయిలాండ్:
థాయిలాండ్ వెళ్లడానికి కూడా మనం వీసా తీసుకోక్కర్లేదు. ఎయిర్ పోర్ట్ లోనే వీసా తీసుకోవచ్చు భారతీయ పర్యటకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. పైగా ఈ ఫుడ్ బాగా ఫేమస్ ఇక్కడ అందమైన బీచ్లు కూడా బాగా ఆకట్టుకుంటాయి.
భూటాన్:
ఇక్కడ కూడా న్యూ ఇయర్ వేడుకలని చేసుకోవచ్చు. భూటాన్ కూడా బాగుంటుంది. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. పైగా ఈ వంటకాలు రుచి చాలా బాగుంటుంది.
ఇండోనేషియా:
ఇండోనేషియాలో కూడా మీరు కావాలనుకుంటే వీసా లేకుండా న్యూ ఇయర్ వేడుకలను చేసుకోవచ్చు. నీలి బీచ్ లు ఇక్కడ బాగా ఆకట్టుకుంటాయి. బాలి బీచ్ లో సర్ఫింగ్ బాగుంటుంది. బాలి వీధిలో షాపింగ్ కూడా బాగుంటుంది.
నేపాల్:
మీరు విదేశాలలో న్యూ ఇయర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు హిమాలయాలు మీదుగా విమాన ప్రయాణం బాగా ఆకట్టుకుంటుంది.