స్టూడెంట్స్ తో కలిసి స్టెప్పులేసిన టీచర్..కానీ అక్కడ మాత్రం..

-

స్మార్ట్ ఫోన్ లేని వాడు ఉండడు.. చిన్న నుంచి పెద్ద పెద్ద భారీ వ్యాపారులు చేసేవాల్లు స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడుతున్నారు. ఇక సోషల్ మీడియా కూడా అంతే.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు.. అందులో ఏదొక వార్త వైరల్ అవుతుంది.. కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్విస్తే మరి కొన్ని మాత్రం కోపాన్ని ,ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి…

ఇక క్లాస్ రూమ్ లలో జరిగే వాటి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పొట్ట చెక్కలయ్యెలా నవ్విస్తాయి.. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్లోరిడా తరగతి గదికి సంబంధించిన వీడియోలో టీచర్, స్టూడెంట్ డాన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను లక్షల మంది చూశారు.. లైకులు, కామెంట్ల తో తెగ ట్రెండ్ చేశారు.

టీచర్, స్టూడెంట్ మధ్య ఈ సంబంధం చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొంటుంటారు. ఈ వీడియోలో, పిల్లవాడు తన గురువుతోపాటు స్టెప్పులు దంచేస్తున్నాడు. ఈ వీడియో చూస్తే క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఎవరూ అనలేరు. ఈ డాన్స్ పోటీ అందరి హృదయాలను గెలుచుకుంది..

ఫ్లోరిడాలోని సమ్మర్ హై స్కూల్ నుంచి వచ్చింది. ఈ వీడియోలో విద్యార్థులు తమ టీచర్‌ను డాన్స్ చేయమని సవాలు చేస్తూ కనిపించారు. ఆ తర్వాత టీచర్ చేసిన డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీచర్లు చాలా సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. మహిళా టీచర్ చేసిన డాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది… అన్ని వీడియోలు వున్నా ఈ వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది.. ఆ టీచర్ డ్యాన్స్ ఇరగదీసిందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news