డాగ్ వర్సెస్ కోబ్రా… ఈ పోరాటంలో గెలుపెవరిదో చూడండి..!

-

విశ్వాసానికి ప్రతీక కుక్క. యజమాని ఉప్పు తిన్నందుకు తన యజమానిని సంరక్షించడమే కుక్క పని. దాని విశ్వాసం ముందు మనిషి కూడా పనికిరాడు. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. ఈ ఘటనలో కూడా ప్రూవ్ అయింది. అవును.. ఓ కుక్క… తన యజమాని ఇంటికి వచ్చిన కోబ్రాతో పోరాడింది. మామూలుగా పోరాడలేదు. పోరాటమంటే ఇది అని చెప్పుకోవచ్చు.

కోబ్రాను కసితీరా కొరికేసి చంపేసింది కుక్క. దీంతో కోబ్రా.. కుక్క చేతిలో ప్రాణాలు కోల్పోక తప్పలేదు. అయితే.. తమ కుక్క.. పాముతో పోరాడుతుండటం చూసిన ఇంటి యజమాని… వాటి పోరాటాన్ని తన మొబైల్ లో బంధించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. నెటిజన్లు ఆ వీడియోపై మండిపడుతున్నారు. వీడియో తీస్తూ కుర్చునే బదులు.. ఆ పామును రక్షించొచ్చు కదా. దాన్ని బంధించి అడవిలో వదిలి పెడితే దాని మానాన అది పోతుంది కదా. ఏదో దారి తప్పి వచ్చినంత మాత్రాన పామును అంత నిర్దాక్షిణ్యంగా కుక్కతో చంపించాలా? అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version