తప్పతాగి పట్టాలపై పడుకున్నాడు.. మీద నుంచి మూడు రైళ్లు వెళ్లినా…

మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన అందరిని షాక్ కి గురించేస్తోంది. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న తరువాత వామ్మో వీడికి సుడి మాములుగా లేదుగా అనకుండా మానరు. బహుశా ఈ ఏటి మేటి సుడిగాడు మనోడే అని ఘంటాపథంగా చెప్పవచ్చు.సరే మీ ఆత్రుతకి కళ్ళెం పెట్టి అసలు విషయంలోకి వెళ్తే…

మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ లో గల రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి చనిపోయి పడిఉన్నాడని స్థానికలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చేలోగా సుమారు మూడు రైళ్ళు అతడిమీద నుంచీ వెళ్ళిపోయాయి. ఈలోగా పోలీసులు రానే వచ్చారు. ఇక అప్పటికే మూడు రైళ్ళు వెళ్ళడంతో మృతదేహాన్ని తీయడానికి మనుషులని కూడా సిద్దం చేసుకున్నారు. రైలు రాదనుకుని ధృవీకరించుకున్న తరువాత పట్టాలపైకి వెళ్లి శవాన్ని తీయడానికి ప్రయత్నించే క్రమంలో అతడి చేతులు పట్టుకోగా…

3 trains pass over man; Cops run to pick dead body, shocked

ఒక్కసారిగా లేచి కూర్చుని తండ్రి వస్తున్నాడు అంటూ కెవ్వు కేక పెట్టడంతో పోలీసుల గుండెలు మోకాల్లోకి జారినంత పనయ్యిందట. షాక్ లోంచి తేరుకున్న పోలీసులు అతడిని నిశితంగా పరిశీలించగా అయ్యగారు ఫుల్లుగా తాగేసి బజ్జున్నాడు. ఎంతగా తాగాడు అంటే మూడు రైళ్ళు అతడిమీద నుంచీ వెళ్ళినా సరే చచ్చిన శవంలా నిద్రలో ఉండిపోయాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించిన పోలీసులు అతడు తేరుకున్న తరువాత అసలు విషయం చెప్పడంతో షాక్ అయ్యాడట. అసలు నా మీద నుంచీ రైలు వెళ్ళే సమయంలో చెయ్యి పైకి లేచినా, చొక్కా కొద్దిపాటిగా ఎగిరినా నేను చచ్చే వాడిని అంటూ కాపాడిన వాళ్లకి చేతులు జోడించి మొక్కుతున్నాడట.