ఫ్యాన్ ని శుభ్రం చేయడానికి కష్టపడుతున్నారా..? ఈ టిప్స్ తో ఫ్యాన్ ని సులభంగా క్లీన్ చెయ్యచ్చు..!

-

ప్రతి ఒక్కరు కూడా ఇంటిని శుభ్రం చేసుకోవాలని అనుకుంటారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే అనారోగ్య సమస్యలు ఏమి కూడా కలగవు. నిజానికి ఇంటిని శుభ్రం చేసుకోవడం అంత ఈజీ కాదు చాలామంది ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఎంతో కష్టపడతారు. ముఖ్యంగా ఫ్యాన్ కి ఉండే దుమ్ము శుభ్రం చేయడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు. సో ఫ్యాన్ ని క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది మీరు కూడా ఫ్యాన్ని క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే.

 

fan cleaing

ఇలా కనుక మీరు మీ ఫ్యాన్ ని క్లీన్ చేస్తే సులభంగా దుమ్ము వంటివి బయటకు వచ్చేస్తాయి సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్ లని క్లీన్ చేయడానికి గలేబుని ఉపయోగించండి ఇది చాలా మంచి టెక్నిక్ సీలింగ్ ఫ్యాన్ ప్రతి రెక్క లేదా బ్లేడ్ కి పిల్లో కవర్ ని తొడకండి. సున్నితంగా మీరు బ్లేడ్ని స్వైప్ చేయండి పిల్లో కవర్ ని తొడిగితే ఫ్యాన్ రెక్కలు అన్ని వైపులా శుభ్రం అవుతుంది దుమ్ము త్వరగా బయటికి వచ్చేస్తుంది శ్రమ కూడా ఉండదు. పాత సాక్సులతో కూడా మీరు ఫ్యాన్ రెక్కలని శుభ్రం చేయొచ్చు.

సాక్స్ రెండు వైపులా పట్టుకుని స్వైపింగ్ మోషన్ లో శుభ్రం చేస్తే, ఈజీగా ఫ్యాన్ రెక్కలు శుభ్రమైపోతాయి. డస్టర్ ని ఉపయోగించి కూడా మీరు మీ ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేసుకోవచ్చు. ఈజీగా డస్టర్ సహాయంతో మీ ఫ్యాన్ క్లీన్ అయిపోతుంది. వ్యాక్యూమ్ క్లీనర్ ని కూడా వాడొచ్చు వాక్యూమ్ క్లీనర్ తో కూడా సులభంగా మీరు ఫ్యాన్ రెక్కలను క్లీన్ చేసుకోవచ్చు. అయితే సీలింగ్ ఫ్యాన్ ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దుమ్ము ధూళి వలన ఎలర్జీలు వంటివి కలగొచ్చు. దుమ్ము వంటివి మీ ముఖం ని జుట్టు ని జిడ్డుగా మారొచ్చు కాబట్టి మీరు శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

Read more RELATED
Recommended to you

Latest news