శృంగార శక్తిని పెంచుకోవడానికి గాడిద మాంసం తింటున్న జనాలు.. అసలు ఏం జరుగుతుందంటే..

-

ఆంధ్రప్రదేశ్ లో గాడిద మాంసం మరో వయాగ్రా అయిపోయింది. చాలా మంది ప్రజలు గాడిద మాంసం తినడం వల్ల శృంగార శక్తి పెరుగుతుందని నమ్ముతున్నారు. కొన్ని దేశాల్లో పులి మాంసం తినడం శృంగార ఆసక్తిని పెంచుతుందని నమ్ముతుండగా, ఆంధ్రప్రదేశ్ లో గాడిద మాంసానికి గిరాకీ పెరిగింది. శృంగార కోరికలను పెంచుతుందని నమ్మడమే కాకుండా ఆస్తమా వంటి శ్వాస సంబంధ వ్యాధులను దూరం చేస్తుందని అనుకుంటున్నారు. దీనివల్ల గాడిదల జనాభా విపరీతంగా తగ్గుతుంది.

జంతు ప్రేమికుల సమాచారం ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాల నుండి గాడిద మాంసం ఆంధ్రప్రదేశ్ కి దిగుమతి అవుతుంది. క్రిష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో గాడిద 10వేల నుండి 20వేల రూపాయలు పలుకుతుంది. ఒక కిలోగ్రామ్ గాడిద మాంసం 600రూపాయలుగా ఉంది. ఇక్కడ జనాలు గాడిద మాంసాన్ని పూపీ అంటారు. ఆనిమల్ వెల్ఫేర్ ఆక్టివిస్ట్ సూరబత్తుల చెబుతున్న దాని ప్రకారం ప్రతీ గురువారం, ఆదివారం గాడిదమ మాంసం మార్కెట్లో విక్రయం జరుగుతుంది. ప్రతీసారి దాదాపుగా 100గాడిదలు అమ్ముతుంటారు.

భారతీయ ఆహార సంరక్షణ ప్రకారం గాడిద మాంసం మనుషులు తీసుకునే ఆహారం కాదు. చట్ట వ్యతిరేకంగా గాడిద మాంసాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. గాడిద మాంసాన్ని అమ్మడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చైనీయుల పురాణాల ప్రకారం గాడిద మాంసం తినడం వల్ల శృంగార శక్తి పెరగడమే కాకుండా కొవ్వుకరుగుతుందని నమ్ముతారు. దీనివల్ల గాడిదల జనాభా బాగా తగ్గిపోతుంది. బ్రిటీష్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ డాంకీ సాంక్ష్యురీ 2019రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 44మిలియన్ల గాడిదల జనాభా ఉంది.

ఇలా అనేక మూఢనమ్మకాల వల్ల వాటి జనాభా 60శాతం తగ్గేలా ఉంది. గాడిద మాంసం తినడం అనేది ప్రకాశం జిల్లాలోని స్టువర్ట్ పురంలో వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ గాడిద రక్తం తాగడం వల్ల పరుగెత్తే శక్తి పెంచుకోవచ్చని నమ్ముతారు. రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో ఈ సన్నివేశం చూపించారని తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news