ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్.. కలిపే ఐటమ్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే ..!

-

కాస్ట్లీ వంటలు గురించి మనం అప్పుడుప్పుడు వినే ఉంటాం. ఖరీదు అంటే.. రెండు మూడు వేలు ఎక్కువగా ఉంటుంది కదా.. కానీ ఇప్పుడు చెప్పుకోబోయో ఫ్రెంచ్ ఫ్రైస్ కాస్ట్ మాములుగా లేదుగా.. మన కరెన్సీలో 15వేలకు పై మాటేనట. ఈ ఫ్రెంచ్ ఫ్రైని న్యూయార్క్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో తయారు చేస్తారు. అసలు అంత కాస్ట్ ఎందుకు ఉంది.. బంగారం ఏమైనా కలుపుతారా ఏంటి అనుకుంటున్నారా.. అవును నిజంగానే అందులో బంగారు రేకులు వేస్తారట..! ఇంకా చాలానే వేస్తారు.

పంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ రికార్డుకు ఎక్కింది. అయితే ఇన్నీరోజులు దీన్ని చాలా సీక్రెట్ గా చేశేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పదార్థాలను దిగుమతి చేసుకుని ఈ విలువైన ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తున్నారు. బంగారు రేకులతో ఈ వంటకాన్ని డెకొరేట్ చేస్తారట. అనేక ఇతర రకాల పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు వైరల్ అయినా ఈ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి షేర్ చేయబడుతుంది. తక్కువ సమయంలో వైరల్‌గా మారింది. అన్ని హోటల్స్ లో చేసే సాధారణ ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది.

అప్‌స్టేట్ చిప్పర్‌బెక్ బంగాళాదుంపలు, పాతకాలపు 2006 డోమ్ పెరిగ్నాన్ షాంపైన్, J. లెబ్లాంక్ ఫ్రెంచ్ షాంపైన్ ఆర్డెన్నే వెనిగర్, ఫ్రాన్స్ నుంచి స్వచ్ఛమైన కేజ్-ఫ్రీ గూస్ ఫ్యాట్, గ్యురాండే ట్రఫుల్ ఉప్పు, ట్రఫుల్ ఆయిల్, క్రీట్ సెనెసి పెకోరినో టార్టుఫెల్ షేవ్డ్ బ్లాక్ సమ్మర్ ట్రఫుల్స్, ఇటాలీ నుండి ట్రఫుల్స్ A2 100% గ్రాస్ ఫ్రీ ఫెడ్ క్రీమ్ ఆవు పాలతో తయారు చేయబడింది. ఏజ్డ్ గ్రుయెర్ ట్రఫుల్డ్ స్విస్.

ఇక ఫ్రెంచి ఫ్రైస్ తయారు చేసి చివరగా గోల్డ్ పౌడర్ ( సన్నని బంగారు రేకులు)తో అలంకరిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌లో 23K ఎడిబుల్ గోల్డ్ డస్ట్ ఉపయోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news