అవునా.. ఇండోనేషియా విమాన ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడిందా?

-

ఇప్పుడంతా మనకు సోషల్ మీడియానే. నో పేపర్, నో టీవీ, నో రేడియో.. ప్రపంచం నలుమూలల ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో తెలిసిపోతుంటుంది. దీంతో ప్రపంచమే కూగ్రామమైపోయింది. అర చేతిలో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. అయితే.. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంలో జెన్యునిటీ ఎంత. నిజం ఎంత. అబద్ధం ఎంత. అంటే.. మాత్రం ఆ దేవుడు దిగివచ్చినా చెప్పలేడు. దేవుడు కూడా చేతులెత్తేస్తాడు. అవును. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం అంత నిజం అని చెప్పలేం.. అంతా అబద్ధం అని చెప్పలేం. కానీ.. కొన్ని సంఘటనలను తీసుకొని విశ్లేషించి మాత్రం చెప్పొచ్చు. అలాంటిదే ఒకటి ఇటీవలే జరిగింది.

ఇండోనేషియాలో విమాన ప్రమాదం జరిగింది కదా. లయన్ ఎయిర్ కు చెందిన విమానం జావా సముద్రంలో కూలిపోయింది కదా. 189 మంది జలసమాధి అయ్యారు. టేకాఫ్ తీసుకున్న 13 నిమిషాలకే విమానం సాంకేతిక సమస్యతో సముద్రంలో కూలిపోయింది. వెంటనే సహాయక చర్యలను రెస్క్యూ టీం ప్రారంభించింది. అయితే సహాయక చర్యలు చేపడుతుండగా.. ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఆ చిన్నారికి లైఫ్ జాకెట్ తొడగడం వల్ల బతికి బట్టకట్టిందంటూ వార్తలు వస్తున్నాయి.

నిజమే కాబోలు అంటూ నెటిజన్లు కూడా ఆ వార్తను షేర్ చేయడం మొదలు పెట్టారు. కానీ.. ఆ చిన్నారి బతికి బయటపడిందంటూ వస్తున్న వార్తలు నిజం కాదు. పక్కా ఫేక్. అసలు ఆ ఫోటో కూడా ఇప్పటిది కాదు. మీరు పైన చూస్తున్నారు కదా అదే ఫోటో. గత ఏడాది అదే ఇండోనేషియాలో జరిగిన నౌక ప్రమాదానికి సంబందించింది. అప్పుడు బతికిన చిన్నారి ఫోటోను ఇదిగో ఇలా మిస్ యూజ్ చేస్తున్నారు నెటిజన్లు. ఫేక్ వార్తలను ఏమాత్రం కన్ఫర్మ్ చేసుకోకుండా షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version