లవ్ లో ఫెయిలయ్యారా.. ఈ టిప్స్ పాటించండి..?

-

ఈ సృష్టిలో అత్యంత తీయనైనది ప్రేమే.. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ప్రేమే జీవితం కాదు.. ఒక ప్రేమ విఫలమైతే జీవితం అంతం కాదు.. ఈ విషయం చెప్పడం సులువే.. కానీ ప్రేమలో ఫెయిలైన వారికే ఆ బాధేంటో తెలుస్తుంది. నిజమే కానీ.. వాస్తవాన్ని కూడా గమనించాలి.. ఇంకా మిగిలిన జీవితం గురించి కూడా ఆలోచించాలి. అందుకే లవ్ లో ఫెయిలైతే ఈ టిప్స్ పాటించండి..

ప్రేమ విఫలమైనప్పుడు.. ప్రేమ తాలూకు గుర్తులేవీ మీ దగ్గర ఉండకూడదనే నిబంధన పెట్టుకోండి. అంటే తీపి గుర్తులుగా దాచుకున్న వస్తువులు, ఫొటోలు, వారి ఫోన్ నెంబర్.. ఇలాంటివన్నీ అన్నీ మీ దగ్గర నుంచి తీసేయండి. వారిని వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అనుసరించడం మానేయండి. అవతలివారి గురించి తెలుసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇవిఅడ్డుకట్టవేస్తాయి.

ఖాళీగా ఉంటే ఆలోచనలు వేధిస్తాయి. అందుకే ఏదైనా కళలో ప్రావీణ్యం సంపాదించడానికి ప్రయత్నించండి. చిత్రకళ, సంగీతం, రాయడం, జిమ్ కు వెళ్లడం.. ఇలా ఏదైనా కానివ్వండి. దానికోసం సమయం కేటాయించుకొని నైపుణ్యాలు పెంచుకోండి. ఇవి మీలో సృజనాత్మకతను పెంపొందిస్తాయి. పాత గాయం నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.

వృత్తిగతంగా లేదా చదువుపరంగా ఏదైనా లక్ష్యం పెట్టుకోండి. దాన్ని సాధించడానికి రోజువారి ప్రణాళిక రూపొందించుకోండి. దాని ప్రకారం మీరు ముందుకు సాగితే ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి, కుంగుబాటు తగ్గుతాయి. మీలో మీరే సతమతమయ్యే బదులు సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి.

మీ ఆప్త మిత్రులతో బాధను పంచుకోండి. ఇది మిమ్మల్ని కుదుటపడేలా చేయడమే కాదు… సమస్యను ఎదుర్కోగలమన్న ధైర్యం వస్తుంది. పాత జ్ఞాపకాల్ని వదిలేయడానికి కొన్ని రోజులు ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. నూతనోత్తేజం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news