కొడుకు ప్రేమించి మోసం చేశాడు.. తండ్రి ఆ యువతికి ఆస్తి రాసిచ్చేశాడు..!

తన కొడుకు ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని షాజి చాలా బాధ పడ్డాడు. ఎలాగైనా ఆ అమ్మాయికి మంచి జీవితం ఇవ్వాలనుకున్నాడు. అందుకే.. ఆ యువతికి మంచి సంబంధం చూసి తానే దగ్గరుండి పెళ్లి జరిపించాడు.

హే.. ఈ ప్రేమా గీమా మన దగ్గర నడవది.. నేను చెప్పిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంతే.. ఇది ఫైనల్.. అని తండ్రులు కొడుకులతో అంటుంటే వింటాం మనం కదా. కానీ.. ఇక్కడ అంతా సీన్ రివర్స్. కొడుకే ఓ యువతిని ప్రేమించి… వాడుకొని వదిలేశాడు. దీంతో ఆ యువతి రోడ్డు మీద పడింది.

father gets girl married with another boy whose son cheated her in kerala

చివరకు పుట్టింటి వారు కూడా తనను పట్టించుకోలేదు. బలాదూర్ గా తిరుగుతావా అని తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ యువతి గురించి తెలుసుకున్న తన మోసం చేసుకున్న యువకుడి తండ్రి.. తనకు మరో జీవితాన్ని ప్రసాదించాడు. ఆ యువతిని మోసం చేసిన తన కొడుకుకు సరైన బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ యువతికి తండ్రి అయ్యాడు. మరో యువకుడిని చూసి పెళ్లి చేశాడు. అంతే కాదు.. తన ఆస్తి అంతా ఆ యువతి పేరు మీద రాశాడు.

చదవడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ.. ఇటువంటివన్నీ సినిమాల్లో జరుగుతాయి కానీ.. నిజజీవితంలోనూ జరుగుతాయా? అని ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ.. ఇది అక్షరాలా నిజం. నిజమంటే నిజం. పదండి అక్కడికే వెళ్లి మిగితా విషయాలు తెలుసుకుందాం.

షాజి.. కేరళలోని కొట్టాయంలో ఉంటాడు. ఆయన కొడుకు ఆరేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకుంటానని తనను నమ్మించాడు. అప్పుడు పెళ్లి కూడా చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ.. అప్పుడు వాళ్లిద్దరు మైనర్లు. మేజర్లు అయ్యాక ఇద్దరికి పెళ్లి చేస్తానని తన తండ్రి షాజి.. ఆ యువకుడికి మాటిచ్చాడు. వాళ్లు మేజర్లు అయి లైఫ్ లో సెట్ అయ్యాక వాళ్లకు పెళ్లి చేద్దామని షాజి నిశ్చయించుకున్నాడు. దీంతో కొడుకును అడిగాడు. అప్పుడు కొడుకుకు తండ్రి భలే షాకిచ్చాడు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను.. అని తండ్రికి తెగేసి చెప్పేశాడు.

ఎందుకంటే.. ఆ యువకుడు ప్రస్తుతం మరో యువతిని ప్రేమిస్తున్నాడు. తనతో పాటు కాలేజీలో చదివే మరో అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆ యువకుడు.. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని తెగేసి చెప్పేశాడు. తను ముందు ప్రేమించిన అమ్మాయిని చేసుకోననడంతో… ఇన్ని రోజు అతడితో తిరిగిన ఆ యువతికి పరువు పోయినంత పని అయింది. ఊళ్లో వాళ్లంతా చులకనగా చూడటం మొదలు పెట్టారు. తమ పరువును గంగలో కలిపేశావని తల్లిదండ్రులు కూడా ఆ యువతిని ఇంట్లోంచి
గెంటేశారు.

తన కొడుకు ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని షాజి చాలా బాధ పడ్డాడు. ఎలాగైనా ఆ అమ్మాయికి మంచి జీవితం ఇవ్వాలనుకున్నాడు. అందుకే.. ఆ యువతికి మంచి సంబంధం చూసి తానే దగ్గరుండి పెళ్లి జరిపించాడు. అంతే కాదు.. తన దగ్గర ఉన్న ఆస్తినంతా ఆ యువతి పేరు మీద రాశాడు. దీంతో తన కొడుకుకు దిమ్మ తిరిగినంత పని అయింది. వావ్.. సూపర్ కదా. తండ్రులంతా ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో?